NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Politics: వైసీపీ పాట పాడుతున్న టీడీపీ…ఆ అంశంపై వైసీపీకి టీడీపీ మద్దతు ఇస్తుందట..

AP Politics: రాజకీయ పార్టీలు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం సహజం. ప్రత్యేక హోదా అంశంపై గతంలో వైసీపీ పాడిన పాటనే నేడు టీడీపీ పాడుతోంది. ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేస్తే వైసీపీ సభ్యులు రాజీనామా చేస్తారనీ కలిసి కేంద్రంపై పోరాడదామని గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. అప్పుడు వైసీపీ కోరికను టీడీపీ మన్నించలేదు. కలిసి ఉద్యమం చేయడానికి ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు టీడీపీ అదే పాట పాడుతోంది. వైసీపీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసే తాము చేస్తామని టీడీపీ పేర్కొంటోంది. ఏపికి ప్రత్యేక హోదాపై వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే తాము కూడా మద్దతిస్తామని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు.

AP Politics tdp mp kanakamedala comments on special status issue
AP Politics tdp mp kanakamedala comments on special status issue

AP Politics: ప్రత్యేక హోదాపై వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే టీడీపీ మద్దతు

కేంద్రం హోంశాఖ త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం పెట్టకోపవడం ఏమిటని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీకి 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ప్రబుత్వానిది వైఫల్యమా..? లొంగుబాటా..? అని ప్రశ్నించారు. వైసీపీ తీరుపై సందేహాలు కలుగుతున్నాయన్నారు. హోదాపై మంచి పరిణామం ఎదురైతే వైసీపీకి, చెడు పరిణామం ఎదురైతే చంద్రబాబుకు ఆపాదిస్తున్నారని కనకమేడల ఆరోపించారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైసీపీ కార్యాచరణ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు కనకమేడల. హోదాపై ఏ విధంగా ముందుకు పోదల్చుకున్నారో చెబితే అందుకు టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని తెలిపారు. హోదా సాదించడం వైసీపీ వల్ల కాదని జగన్ చెబితే టీడీపీ కార్యాచరణ ప్రకటిస్తుందని కనకమేడల స్పష్టం చేశారు.

అజెండా నుండి ప్రత్యేక హోదా తొలగింపు

రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం ఈ నెల 17వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశ అజెండాలో తొలుత ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చడంతో ఇది తమ ఘనతగా వైసీపీ చెప్పుకోంది. అయితే ఈ అజెండాలోని అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ బీజేపీ రాజ్యసభ్యుడు జీవీఎల్ నర్శింహరావు కేంద్ర పెద్దలతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఆ అజెండాను మార్పు చేసింది కేంద్ర హోంశాఖ. ఆ అజెండా నుండి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారు. దీంతో వైసీపీ నేతలు చంద్రబాబు, టీడీపీ కుట్ర అంటూ విమర్శలు చేశారు. దీనిపై కనకమేడల కౌంటర్ ఇచ్చారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju