NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 18 Today Episode: దీపకు, కార్తీక్ కు మధ్య అగ్గి రాజేసిన మోనిత. దీప శాపం మోనిత కోపం అనే ఆపరేషన్ మొదలుపెట్టిన మోనిత..!

Karthika Deepam Feb 18 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దామా. గత ఎపిసోడ్ లో మోనిత పెట్టిన కండీషన్ గురించి కార్తీక్‌ దీపతో చెబుతాడు.కానీ దీప మాత్రం ఇది కరెక్ట్ కాదు కార్తీక్ బాబు మళ్ళీ మోనిత ఏదో కుట్ర చేస్తోంది అని చెబుతుంది. అయితే దీప చెప్పిన మాట కార్తీక్ వినడు. దాంతో దీప కాస్త కోపంగా ఉంటుంది.ఈ క్రమంలోనే ఈరోజు సీరియల్ ఎంతో ఉత్కంఠగా మారింది.

Health: ఉదయం పూట స్నానం ఇలా చేయండి… అది మీ శరీరం,మనస్సు మీద అద్భుతం గా పనిచేస్తుంది !!

Karthika Deepam Feb 18 Today Episode: బాబాయ్ కి దైర్యం చెబుతున్న మోనిత :

మోనిత వాళ్ళ బాబాయ్ తో మాట్లాడుతూ
‘బాబాయ్ వాళ్లు వీళ్లు చెప్పే మాటలు వినకు.కార్తీక్‌తో నీకు ఆపరేషన్ చేయిస్తాను అని మాట ఇచ్చి ధైర్యం చెబుతుంది.సీన్ కట్ చేస్తే సౌందర్య ఇంట్లో అంతా భోజనానికి సిద్ధం అవుతారు. కానీ దీప మాత్రం కాస్త కోపంగా మీరు తినండి అని చెప్పి ఆనంద్‌ని ఎత్తుకుని అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంది. ‘ఏంట్రా పెద్దోడా ఏం అయ్యింది? ‘ఏం లేదులే మమ్మీ.. నేను మాట్లాడి వస్తాను మీరు పదండి’ అంటాడు. ‘మోనిత బాబాయ్‌కి ఆపరేషన్ చేయడం దీపకు ఇష్టం లేదు.అదేదో చేస్తే ఎలాగైనా మోనిత చెప్పిన ప్రకారం బస్తీలో క్లినిక్ తీయించెయ్యొచ్చు. దీపకు త్వరలోనే ఈ విషయం అర్థమవుతుందిలే’ అనుకుంటాడు మనసులో.

Health: ఉదయం పూట స్నానం ఇలా చేయండి… అది మీ శరీరం,మనస్సు మీద అద్భుతం గా పనిచేస్తుంది !!
మోనిత దొంగ కన్నీళ్లను కార్తీక్ నమ్ముతాడా.?

సీన్ కట్ చేస్తే.. కార్తీక్ దగ్గరకు మోనిత, వాళ్ళ బాబాయ్ ఇద్దరు వస్తారు.అతడికి మందులు రాసి ఆపరేషన్ రెండు మూడు రోజుల్లో ప్లాన్ చేద్దాం.. టైమ్ డేట్ నేను తనకి చెబుతాను లెండీ’ అంటాడు కార్తీక్. ఇక వాళ్ళ బాబాయ్ ను బయటకు పంపి మోనిత కార్తీక్ ముందు కూర్చుంటుంది. ఈ ఆపరేషన్ అయ్యాక నువ్వేం మాట తప్పవుగా?’ అంటాడు కార్తీక్. ‘కార్తీక్ ప్రేమంటే నమ్మకం కార్తీక్.. నమ్మకం అంటేనే మోనిత.. మోనిత అంటే నమ్మకం కార్తీక్..’ అంటుంది మోనిత. ‘ఈసారైనా మాట మీద నిలబడతావని అనుకుంటున్నాను’ అంటాడు కార్తీక్. నువ్వంటే నాకు ఎంత ప్రేమో గౌరవమో నీకు తెలియదా’ అంటుంది మోనిత.నా మీద గౌరవం కూడా ఉందా నీకు’ అంటాడు కార్తీక్ కోపంగా పైకి లేచి.. ‘ఎంత మాట కార్తీక్.. నువ్వంటే నాకు గౌరవం లేకపోవడం ఏంటీ’ అంటుంది మోనిత. ‘అంత గౌరవమే ఉంటే.. ఇలా నన్ను వెంటాడకు. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకు.. దయచేసి నన్ను వదిలెయ్ మోనితా.. ప్రశాంతంగా బతకనివ్వు..’ అంటాడు కార్తీక్. ‘ఇక మోనిత రెండు కన్నీటి బొట్లు కార్చి బయటికి వస్తుంది. బయటికి వచ్చి.. నవ్వుతూ.. ‘బాబాయ్ ఆపరేషన్‌తోనే మనం కలిపే ఆపరేషన్ నేను ప్లాన్ చేసుకున్నానుగా’ అనుకుంటుంది.

మోనిత కుట్ర గురించి ఆలోచిస్తున్న దీప :

ఇక దీప ఒంటరిగా కూర్చుని మోనితకి బాబాయ్ మీద అంత ప్రేమ ఉందా? లేక నాటకం ఆడుతుందా? మోనితని నమ్మడానికి లేదు’ తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటుంది.సీన్ కట్ చేస్తే ఆనందరావు ఎంట్రీ ఇస్తాడు రావడం రావడంతోనే ఆవేశంగా ఆనందరావు కార్తీక్ క్యాబిన్‌కి వస్తాడు. అప్పటికి కార్తీక్ ముందు ఓ పేషెంట్ ఉంటాడు. ఆనందరావు ఆవేశాన్ని గమనించిన కార్తీక్.. అతడికి త్వరగా టాబ్లెట్స్ రాసి పంపించేస్తాడు. ‘డాడీ ఏంటి ఈ ఆవేశం అంటే ‘నువ్వు మోనిత వాళ్ల బాబాయ్ ఆపరేషన్‌కి ఒప్పుకున్నావా అంటూ అరుస్తూనే ఉంటాడు ఆనందరావు. ‘దీప చెప్పిందా? దీపకు అర్థం కావట్లేదు డాడీ.. ప్లీజ్ డాడీ మీరు ఇంటికి వెళ్లండి అంటూ ఇంటికి పంపిస్తాడు.

Abyangasnanam: అభ్యంగ స్నానం అంటే ఏమిటి? అసలు రాత్రి స్నానం ఎలా చేయాలి ?
మోనిత అసలు ప్లాన్ ఏంటంటే..?

మోనిత బాబాయ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావ్ అని అడిగిన మోనితతో.. రమ్మన్నావ్ వచేశానమ్మా అసలు ఆసుపత్రిలో ఎన్నిరోజులు ఉండాలి? నాకేదో చాలా గుబులుగా ఉందమ్మా..’ అంటాడు కాస్త దిగులుగా..భయపడాల్సిన పనిలేదు.. చూసుకోవడానికి నేను ఉన్నాను అంటుంది.ఆపరేషన్ చెయ్యడానికి మీ అల్లుడు కార్తీక్ ఉన్నాడు’ అంటూ ధైర్యం చెబుతుంది. ‘బాబాయ్ సిక్త్స్ సెన్స్ బాగానే పనిచేస్తుంది. పోయేకాలం వస్తున్నప్పుడు ఇలా తెలుస్తుంది అంటారు. అసలు నిన్ను ఆసుపత్రిలో జాయిన్ చేస్తేనే కదా బాబాయ్.. నా ప్లాన్ వేరే..నీ ఆపరేషన్ అడ్డు పెట్టుకునే నేనో కొత్త ఆపరేషన్ మొదలుపెట్టాను.. దాని పేరు దీపం-శాపం.అంటే మోనిత కోపం దీప శాపం అనుకుంటుంది మనసులో.

Bigg Boss: బిగ్ బాస్ ఓటీటీలోకి వెళ్లే యాంకర్ అతడేనా.!?
దీప మీద కోపం కార్తీక్ ఏమి చేయనున్నాడు..?

ఇక కార్తీక్ ఇంటికి రావడం రావడమే దీప దీపా అంటూ ఉగిపోతాడు.అక్కడే ఉన్న సౌందర్య, ఆదిత్యలు ఏం అర్థం కానట్లుగా చూస్తారు. ‘ఇంట్లో వాళ్లకి ఎక్కించాల్సిందంతా ఎక్కించి తను ఎక్కడికి వెళ్లింది’అంటూ ఆవేశంతో అరుస్తూ ఉంటాడు. ‘ఏం అయ్యిందిరా పెద్దోడా?’ అంటుంది సౌందర్య. ‘నేను చెబుతాను సౌందర్యా’ అంటూ వెనుకే వస్తాడు ఆనందరావు. ‘వీడు ఆ మోనిత వాళ్ల బాబాయ్ కి గుండె ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాడట అంటాడు ఆనందరావు. సౌందర్య, ఆదిత్యలు ‘ఇది కరెక్ట్ కాదు’ అని చెబుతారు. ‘మీరంతా ఆ దీప చెప్పినా మాటలే నమ్మండి.. అసలు ఈ ఇంట్లో నా మాటకు ఏముంది విలువా? అంటాడు.ఏం అన్నావ్‌రా పెద్దోడా.. నీ మాటకు ఈ ఇంట్లో విలువ లేదా? నీకోసం ఈ ఇల్లు ఏం చెయ్యలేదా? అంటూ సౌందర్య ఎమోషనల్‌గా అంటుంది. ‘పెద్దోడా దీప దేవతరా.. నీకు ప్రతి కష్టంలోనూ తను అండగా ఉంది ఆనందరావు సద్దిచెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella