NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అభి కోపంతో ఎస్సైని ఏం చేశాడు.!? తులసి ఏం చేసి అభిని కాపాడుతుంది.!?

Intinti Gruhalakshmi: తులసి అభిని వెతికి తనతో మాట్లాడుతుంది నా కోసం పోలీసులు వెతుకుతున్నారు అంటూ అభి దీనంగా మాట్లాడుతాడు.. తల్లి మాట వినకపోతే బిడ్డ ఎన్ని కష్టాలు పడతాడో తెలిసొచ్చింది.. అనుభవిస్తున్నాను మామ్..!! ఇప్పుడు నా వల్ల కావట్లేదు మామ్.. నేను బ్రతికి ఉన్నానో.. చచ్చానో.. నాకే తెలియడం లేదు మామ్.. నరకం చూస్తున్న మామ్.. ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి పోలీసులు పట్టుకుంటారోనని భయంగా ఉంది.. ఒక నిమిషం కళ్ళు కళ్ళు మూసుకున్నాను అంటే భయం ఎక్కడైనా ప్రశాంతంగా ఒక నిమిషం ఉంచి ఉందామంటే భయంగా ఉంది.. ఎవరైనా చావంటే భయపడతారు కానీ.. నాకు బ్రతకాలంటే భయంగా ఉంది మామ్.. ఇప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర ఉన్నావ్ ధైర్యంగా ఉండు ఏం భయపడకు నేను కాపాడుకుంటాను అని తులసి అభికీ భరోసా ఇస్తుంది..!!

Intinti Gruhalakshmi: 19 Feb 2022 Today 560  Episode Highlights
Intinti Gruhalakshmi: 19 Feb 2022 Today 560 Episode Highlights

560వ ఎపిసోడ్ హైలైట్స్..!!

నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను మామ్ నేను ఎవరిని చంపాలని అనుకోలేదు చంపాలన్న ప్రయత్నం కూడా చేయలేదు నేను చేసిన తప్పు నీకు తెలియకుండా పది లక్షల అప్పు తీసుకోవడం ఆ డబ్బులు నా ఫ్రెండ్ మనోజ్ కి షేర్స్ లో ఇన్వెష్ట్ చేయమన్నాను.. వాడు నన్ను నమ్మించి 10 లక్షలతో పారిపోయాడు. వెంటపడి పట్టుకున్నాను నా డబ్బులు నాకు ఇవ్వమని ప్రాధేయపడ్డాను.. వాడు ఇవ్వను అన్నాడు‌ ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో పో అన్నాడు. ఆ గొడవలో వాడు ఎలా కింద పడ్డాడో.. బాటిల్ ఎలా వాడికి గుచ్చుకుందో కూడా నాకు తెలియదు.. కళ్ళు మూసి తెరిచే లోపే అంతా జరిగిపోయింది మామ్.. అంటూ అభి ఏడుస్తాడు.. వాడు రక్తపుమడుగులో కనిపించాడు మామ్.. ఆ భయంతో పారిపోయాను.. అప్పటినుంచి ఇప్పటివరకు పరిగెత్తుతూనే ఉన్నాను మామ్..

Intinti Gruhalakshmi: 19 Feb 2022 Today 560  Episode Highlights
Intinti Gruhalakshmi: 19 Feb 2022 Today 560 Episode Highlights

తులసి, అభి మాట్లాడుకుంటూ ఉండగా ఎస్సై అభిని చూసి గుర్తుపట్టి దగ్గరకు వస్తాడు.. దాంతో తులసిని తోసేసి అభి పారిపోతాడు.. ఇక ఎస్సై రేయ్ నువ్వు పారిపోతే నువ్వు వచ్చే వరకు మీ అమ్మ లాక్ అప్ లో ఉంటుంది అనగానే.. అభి వెనక్కి వచ్చి నేను లొంగీపోతాను అని చెబుతాడు. ఎస్సై గారు మా అభి ఏం తప్పు చేయలేదని తులసి చెప్పే ప్రయత్నం చేస్తుంది.. ఇక ఆ ఎస్సై తులసిని నానా మాటలు అంటాడు. ఇక తులసిని అవునే మదర్ ఇండియా నీ మొగుడు ఏడి అని చాలా నీచంగా మాట్లాడుతుంటే.. కోపం వచ్చిన అభి ఎస్సై కాలర్ పట్టుకుని అరుస్తాడు.. ఇక కోపం వచ్చిన ఎస్సై నా ఇగో నీ టచ్ చేసి నీ సమాధికి నువ్వే పునాది వేసుకున్నావు.. నీ అంతు చూస్తాని స్టేషన్ కి తీసుకెళ్తాడు.. అభి నిన్ను కాపాడే బాధ్యత నాది.. రేపటికల్ల బెయిల్ మీద తీసుకువస్తానని భరోసా ఇస్తుంది.

ఇక ఇంటికి వచ్చిన తులసిని అందరూ అభి కనిపించడా అని అడుగుతారు. జరిగిందంతా తులసి చెబుతుంది. ఇక నందు అభిని గురించి తెలుసుకుంటాడు. ఇక అంకిత ఏడుస్తూ అభిని చూడాలి మాట్లాడాలి అని అంటుంది. ఇక అభి ఏం తప్పు చేయలేదని తనని కాపాడే బాధ్యత తనదని తులసి అంకిత కు హామీ ఇస్తుంది. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిస్తుంది.. ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతోందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?