Mahesh Babu: ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే, మన తెలుగు సినిమాల్లో హీరోలే విలన్స్ గా మారుతున్న వైనాన్ని మనం గమనించవచ్చు. ఈ క్రమంలోనే హీరో జగపతి బాబు బాలయ్య – బోయపాటి కాంబో అయినటువంటి ‘లెజెండ్’ సినిమాలో విలన్ రోల్ పోషించారు. ఇక దాని తరువాత జగపతి బాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే కమిడియన్ సునీల్ ‘పుష్ప’ సినిమాలో ఓ కీలక రోల్ పోషించాడు. అదే కోవలోనే ఒకప్పటి ఫ్యామిలీ హీరో అయినటువంటి శ్రీకాంత్ ‘అఖండ’ సినిమాలో విలన్ గా అలరించారు.
Sarkaru vaari paata: ‘కళావతి’ పాట ఒక్కటే ఇంత సంచలనం సృష్ఠించిందా..!
Mahesh Babu: కోలీవుడ్ స్టార్స్?
ఒకప్పటితో పోల్చుకుంటే మన టాలీవుడ్ స్థాయి మారింది. రాజమౌళి పుణ్యమాని మన సినిమాలు జాతీయ స్థాయిలో తమ సత్తాని చాటుతున్నాయి. అందుచేతనే కోలీవుడ్ కి సంబంధించిన కొంతమంది హీరోలు సైతం మన తెలుగు సినిమాల్లో విలన్స్ రోల్స్ చేయడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, సముద్రఖని, అర్జున్ వంటి ఈ లిస్టులో వుంటారు. ఇంకా అవకాశం రావాలే గాని అనేకమంది మన తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధంగా వున్నారు.
Mahesh Babu: నిన్న మహేష్ కూతురు… నేడు కీర్తి సురేష్..!!
విలన్ గా విక్రమ్?
ఇక ఈ జాబితాలో హీరో విక్రమ్ కూడా చేరిపోయే అవకాశాలు మెండుగా వున్నాయి . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసినదే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ శోభనను తీసుకున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం హీరో విక్రమ్ ను సంప్రదిస్తున్నారనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ పాత్రకి ఆయన అయితేనే బాగుంటాడనే ఉద్దేశంతో ఆయనను ఒప్పించడానికి త్రివిక్రమ్ ట్రై చేస్తున్నారని వినికిడి.