NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

AP Cinema Ticket rates: ఏపిలో సినిమా టికెట్ల వ్యవహారం ఇప్పట్లో తేలదా..? అసలు విషయం ఇదీ..!!

AP Cinema Ticket rates: ఏపిలో సినిమా టికెట్ల ధరలు, ఇతర సమస్యలపై ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో సహా ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, ఆలీ, ఆర్ నారాయణమూర్తి తదితర సినీ రంగ ప్రముఖులు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులు చెప్పిన విషయాలపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ నెలాఖరు కల్లా గుడ్ న్యూస్ తో జీవో వస్తుందని, వివాదం సద్దుమణిగినట్లే అని అందరూ అనుకున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా పలు మార్లు భేటీ అయింది. టికెట్ల ధరలపై ఓ రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే టికెట్ల ధరల నిర్ణయం జరగకపోవడానికి అసలు కారణం ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి మాటల్లో వెల్లడైంది.

AP Cinema Ticket rates issue
AP Cinema Ticket rates issue

AP Cinema Ticket rates: సీఎం జగన్ తో పోసాని కృష్ణమురళి భేటీ

ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని శుక్రవారం పోసాని కృష్ణమురళి భేటీ అయ్యారు. హైదరాబాద్ నుండి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన కృష్ణమురళి.. సీఎం జగన్ ను కలిశారు. అనంతరం పోసాని మీడియాతో మాట్లాడుతూ ఈ భేటీ వ్యక్తిగతమైనదనీ, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అన్నారు. తన కుటుంబం కరోనాతో బాధపడుతున్న సమయంలో సీఎం జగన్, ఆయన సతీమణి భారతి మాట సాయం చేశారనీ, ఏఐజీ ఆసుపత్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అందుకే సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని వెల్లడించారు. ఈ సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు తన దైన శైలిలో పోసాని సమాధానాలు ఇచ్చారు.

చిన్న సినిమాల నుండి ప్రతిపాదనలు అందాకే

సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. చిన్న సినిమాల నుండి ప్రతిపాదనలు అందాకే టికెట్ల ధరలపై నిర్ణయం వస్తుందన్నారు. అయితే ఈ భేటీలో సీఎంతో సినిమా టికెట్ల ధరలపై తాను చర్చించలేదని చెప్పారు. ఆలీకి ఇస్తున్నట్లే తనకు పదవి ఇస్తున్నారు అనడంలో వాస్తవం లేదని తెలిపారు. భీమ్లానాయక్ సినిమా టికెట్ల గురించి తనకు తెలియదనీ, తాను సినిమా వాడినే గానీ దాని గురించి తనకు తెలియదని పోసాని పేర్కొన్నారు. పోసాని మాట్లాడిన దాని బట్టి చూస్తే చిన్న సినిమాల నుండి ఇంకా ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చినట్లు లేదు. ఇదిలా ఉంటే.. మంత్రి గౌతమ్ రెడ్డి మరణం బాధలో తాము ఉన్నామనీీ, అందువల్లనే టికెట్ ధరలకు సంబంధించి జీవో ఆలస్యం అయ్యిందని ఏపి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N