Anasuya Chiranjeevi: టెలివిజన్ రంగంలో మరియు సినిమా ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో అనసూయ.. సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయినా గాని.. కుర్ర యాంకర్లకు మంచి పోటీ ఇస్తూ రాణిస్తోంది. వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అన్ని రకాలుగా ఆల్ రౌండర్ గా… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదేవిధంగా కొన్ని సినిమాలలో ఐటెం పాటలకు డాన్సర్ గా అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమాల్లో విలన్ పాత్రలో కూడా మెప్పించడం తెలిసిందే. ఈ రకంగా రాణిస్తున్న యాంకర్ అనసూయ కి… తాజాగా మెగాస్టార్ చిరంజీవి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళితే.. కోపంగా కాదు ఒక సీన్ లో.. చిరంజీవితో దురుసుగా ప్రవర్తించే క్యారెక్టర్ అనసూయ చేసినట్లు ఈ క్రమంలో చిరంజీవి ఆమెకి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. పూర్తి విషయంలోకి వెళితే చిరంజీవి నటిస్తున్న “గాడ్ ఫాదర్” లో… అనసూయ కీలక పాత్ర పోషించడం జరిగిందట. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. అనసూయ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చిరంజీవికి అనసూయ కి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సన్నివేశాలు ఉన్నట్లు.. దానిలో భాగంగా అనసూయ… చిరంజీవి ని ఎదిరించే సీన్ సన్నివేశంలో ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు.. సోషల్ మీడియాలో సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
యాంకర్ అనసూయ దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్.. మరికొంతమంది మెగా హీరోలు మినహా దాదాపు మెయిన్ హీరోలు బన్నీ, రామ్ చరణ్ లతో సినిమాలు చేయగా ఇప్పుడు చిరంజీవి సినిమా చేస్తూ ఉంది. ఒకపక్క సినిమారంగంలో అదేవిధంగా మరోపక్క ఓటిటి… ఇంకా టెలివిజన్ రంగంలో కూడా అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా అనసూయ.. సక్సెస్ఫుల్ కెరియర్ ఆస్వాదిస్తోంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!