NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం బిగ్ స్టోరీ

Russia Life: రష్యాలో మారిన జీవనం ..! యుద్దం నీతి ఇదే..!

Russia Life: మన కంటే బలహీనుడు, చిన్న వాడిపై యుద్దం చేసి ప్రాణాలు తీయడం సులువే. కానీ దీని వల్ల సమజంలో బలహీనుడిపై సానుభూతి, బలవంతుడిపై ధ్వేష భావం వస్తుంది. ఆ బలవంతుడి అహంకారానికి గుణ పాఠం చెప్పాలని సమాజం అనుకుంటుంది. సో.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో అదే జరుగుతోంది. మూడు వారాలకు పైగా రష్యా..ఉక్రెయిన్ లోని నగరాలపై క్షిపణి, బాంబు దాడులు కొనసాగిస్తోంది. పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఉక్రెయిన్ లో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతుండగా, రష్యాలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జనాలు బయట రెస్టారెంట్లకు వెళ్లి తినడానికి అలవాటు పడ్డారు. అక్కడ తిన్న తరువాత క్రెడిట్ కార్డులతో బిల్లులు కడతారు. అయితే రష్యాలో క్రెడిట్ కార్డులతో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Russia Life: people suffering
Russia Life: people suffering

ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు

అదే విధంగా కార్లు, బైక్ లపై బయటకు వెళ్లాలంటే అక్కడ పెట్రోల్ రేటు విపరీతంగా పెరిగింది. ఒక బ్రెడ్ తినాలనుకుంటే గతంలో 100 రూబళ్లు ఉన్న బ్రెడ్ ధర ఇప్పుడు రూ.250 రూబుళ్లకు పెరిగింది. వంద శాతంకు పైగా ధర పెరిగింది. ఇంట్లోనే ఉండి ఏదైనా సినిమా చూద్దామంటే నెట్ ఫ్లిక్స్ సర్వీసులను నిలుపుదల చేశారు. మాస్టర్, వీసా లాంటి క్రెడిట్ కార్డు సర్వీసులు నిలిచిపోయాయి. అలానే ఐ ఫోన్ సర్వీసులు ఆపేశారు. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో రష్యాకు ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. శ్యాంసంగ్ లాంటి దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. రష్యా ప్రజలు ప్రస్తుతం వెరైటీ నరకం అనుభవిస్తున్నారు. యుద్దం కారణంగా ఉక్రెయిన్ లో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది వలసలు వెళ్లిపోయారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన అహంకాన్ని చూపిస్తున్న కారణంగా స్వదేశంలో ఇంతకు ముందు ఎవరూ ఎదుర్కోలేని సమస్యలు వస్తున్నాయి.

 

Russia Life: ఇబ్బందుల్లో ప్రజల జీవనం

రష్యాలో ఇంథనం పెట్రోల్ కు సంబంధించి షెల్, ఎక్సెల్ మెబైల్, బీబీ అనే మూడు కంపెనీలు లావాదేవీలు ఆపేశాయి. వాహనాలకు సంబంధించి టయోటా, మెర్సిడెస్ బెంజ్, ఓక్స్ వ్యాగన్, రెనో, ఓల్వో కార్లు తదితర కంపెనీలు అమ్మకాలను తమ సర్వీసులను నిలిపివేశాయి. రెస్టారెంట్ లకు సంబంధించి పెప్సికో, కార్స్ బర్గ్, బడ్వర్. బగ్గర్ కింగ్, మెగ్డోనాల్ మూసివేశాయి. ఫర్నీచర్, ఫ్యాషన్, వినోదానికి సంబంధించి ఐకియా, స్ట్రాస్ అండ్ కో, హెచ్ అండ్ ఎం, సోనీ పిక్చర్స్, నెట్ ఫ్లిక్స్ ఇవన్నీ రష్యాలో పూర్తిగా వినోదాన్ని నిలిపివేశాయి. విమానయానానికి సంబంధించి వైకో, ఎయిర్ బస్ రాకపోకలు ఆపేశాయి. టెక్నాలజీకి సంబంధించి యాపిల్, సాంసంగ్, డెల్ టెక్నాలజీ, గుగుల్, టిక్ టాక్, ఎటీఎన్టీ నిలిచిపోయాయి. దీంతో రష్యాకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. రష్యాలో ప్రజలకు యుద్ద భయం లేదు., ప్రాణ భయం లేదు కానీ జీవన శైలి కష్టంగా మారింది. టీవి చూద్దామంటే లేదు. బయటకు వెళ్లాలంటే వెళ్లలేరు. ప్రశాంతంగా బయట నుండి ఫుడ్ తెచ్చుకుని తినాలంటే లేదు. అన్నీ రేట్లు పెరిగిపోయాయి. యుద్ద నీతి ఇలానూ తెలుసుకోవచ్చు.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju