NewsOrbit
న్యూస్ సినిమా

KGF 2: ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్‌కు హోస్ట్ అండ్ గెస్ట్‌ను ప్రకటించిన మేకర్స్..

KGF 2: ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ సినిమాలలో కేజీఎఫ్ ఛాప్టర్ 1 సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 కూడా ఒకటి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ 1 సినిమాతో హీరో యష్, ప్రశాంత్ నీల్‌లకు పాన్ ఇండియన్ రేంజ్‌లో స్టార్స్‌గా క్రేజ్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సీక్వెల్ సినిమాపై ఆసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి.

kgf-2-trailer launching event host and guest declared by makers
kgf-2-trailer launching event host and guest declared by makers

గత ఏడాది నుంచి ఇదుగో అదుగో అంటూ అభిమానులను ఊరిస్తూ వస్తున్న కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే నెల ( ఏప్రిల్ 14 వ తేదీన) అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్నీ సౌత్ భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా కూడా పోటీగా రాబోతోంది. అందుకే ఇప్పటి నుంచి మేకర్స్ భారీగా ప్రమోషన్స్ ప్రారంభించారు.

KGF 2: ఈ విషయాలను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఇటీవలే ఫస్ట్ సింగిల్ తుపాన్ తుపాన్ పాటను విడుదల చేయగా అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. మార్చి 27వ తేదీన ఈ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించబోతుండగా బాలీవుడ్ బడా మేకర్ ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. అంతేకాదు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ఛీఫ్ గెస్ట్‌గా దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్ హాజరవబోతుండటం విశేషం. తాజాగా ఈ విషయాలను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N