NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కు ఘోర అవమానం .. పాక్ లో తొలి రికార్డు

Imran Khan: పాకిస్థాన్ లో ఇమ్రాన్ సర్కార్ కుప్పకూలింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు. పాకిస్థాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ రికార్డుకు ఎక్కారు. శనివారం పాక్ జాతీయ అసెంబ్లీలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాక్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు శనివారం ఉదయం 10.30 గంటలకు జాతీయ అసెంబ్లీ సమావేశమైంది. అధికార పక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో సభ మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం 3 గంటల వరకు ఒక సారి, రాత్రి 8 గంటల వరకు మరో సారి వాయిదా పడింది.

Imran Khan government in pakistan collapsed
Imran Khan government in pakistan collapsed

Imran Khan: ఆదివారం తెల్లవారుజామున ఓటింగ్

ఆ తర్వాత సమావేశమైనా మరో రెండు సార్లు వాయిదా పడింది. ఆ తరువాత ఆదివారం తెల్లవారుజామున ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగే సమయంలో ఇమ్రాన్ ఖాన్ సభలో లేరు. ఇమ్రాన్ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ సభ్యులు సభ నుండి వాకౌట్ చేయగా, ఆయనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సొంత పార్టీ సభ్యులు మాత్రం ప్రభుత్వ స్థానంలోనే ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే పదవి కోల్పోవడం ఖాయం కావడంతో ఇమ్రాన్ ఖాన్ ముందుగానే తన అధికార నివాసం నుండి ఖాళీ చేసి వెళ్లిపోయారు.

ఇమ్రాన్ సర్కార్ కు వ్యతిరేకంగా 174 ఓట్లు

మొత్తం 342 మంది సభ్యులు ఉన్న పాక్ జాతీయ అసెంబ్లీలో మెజార్టీకి అవసరమైన బలం 172. అయితే ఇమ్రాన్ సర్కార్ కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిఖ్ ప్రకటించారు. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో తదుపరి ప్రధానిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్ధి, పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీ అభ్యర్ధి షెహబాజ్ షరీఫ్ తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పాక్ జాతీయ అసెంబ్లీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju