అనుష్క ఈ ఏడాది నిర్మాతగా మారుతున్నారా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. పెళ్లయిన తర్వాత నాలుగు డీసెంట్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న అనుష్క శర్మ త్వరలోనే నిర్మాతగా మారనున్నారట. నెట్‌ఫ్లిక్స్ కోసం మూఢనమ్మకాలకు సంబంధించిన ఓ షోను ఆమె నిర్మించనున్నారట. మరోవైపు జంతువుల కోసం ఓ హాస్పిటల్ కట్టించనున్నారు. ఈ హాస్పిటల్‌తో పాటు ఓ షెల్టర్‌ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. 2018లో ఆమె నటించిన చిత్రాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. సో అటు సినిమాలను, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలన్స్ చేసుకోవాలన్నది అనుష్క నిర్ణయం. అందుకే తన వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని, వ్యాపకాన్ని కూడా పర్ఫెక్ట్గా బ్యాలన్స్ చేసుకుంటున్నారు అనుష్క.
previous post
next post