నివేదా థామస్ ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నారు. చదువు పూర్తి చేసి సంపూర్ణంగా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. తాజాగా ఆమె ఓ భారీ ఛాన్స్ కొట్టేశారు. ఆమె తాజా చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా నటించనున్నారు. అందులో రజనీకాంత్, నయనతార జంటగా కనిపిస్తారు. మురుగదాస్ దర్శకత్వం వహించే ఆ సినిమా రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని టాక్. పేరు కూడా కుర్చీ అని వినిపించింది. అయితే అందులో నిజం లేదని చిత్రయూనిట్ వర్గాలు చెప్పాయి. మురుగదాస్ కూడా స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఇందులో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారన్నది వాస్తవం. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఎలాంటి ఆటంకం లేకుండా సినిమా పూర్తి కావాలని మురుగదాస్ ఈ మధ్య పళనికి కూడా వెళ్లి మొక్కులు తీర్చుకుని వచ్చారు. ఇంతకు ముందు దృశ్యంలో కమల్‌హాసన్ కుమార్తెగా నటించిన నివేదా తాజా సినిమాలో రజనీకాంత్ కుమార్తెగా నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందట. నయనతారకు, నివేదాకు సినిమాలో ఏం సంబంధం అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవల తమిళంలో విశ్వాసంలో 13 ఏళ్ల కుమార్తెకు తల్లిగా నటించిన నయనతార, ఈ సినిమాలో నివేదాకు తల్లిగా కనిపిస్తారా? వేచి చూడాల్సిందే.
previous post
next post