Nani: `శ్యామ్ సింగరాయ్`తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన న్యాచురల్ నాని.. మరో హిట్‌ను ఖాతాలో వేసుకునేందుకు నయా ప్లాన్ వేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాని నటించిన తాజా చిత్రం `అంటే.. సుందరానికీ!`. ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రయే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది.
ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో పల్లెటూరికి చెందిన బ్రాహ్మణ యువకుడిగా నాని నటిస్తే.. విదేశాలకి చెందిన మోడ్రన్ యువతిగా నజ్రియా ఆకట్టుకోనుంది. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జూన్ 10న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ప్రస్తుత రోజుల్లో విడుదలకు ఇంకా రెండు, మూడు వారాలు ఉందనంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ, నాని మాత్రం జూన్‌లో రిలీజ్ ఉంటే మార్చి నుంచే `అంటే.. సుందరానికీ!` సంబంధించి వరుస అప్డేట్స్ను బయటకు వదులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. మొన్నామధ్య నాని పుట్టిన రోజు సందర్భంగా `బర్త్‌డే హోమం` పేరుతో వదిలిన వీడియో సైతం విశేషంగా ఆకట్టుకుంది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. `అంటే.. సుందరానికీ!` టీజర్ ను రిలీజ్ చేవడానికి మేకర్స్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు టీజర్ ను వదలబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. మొత్తానికి ప్రమోషన్స్ విషయంలో నాకు పోటీ లేరని నాని నిరూపించుకుంటున్నాడు.
Most fun film of the year ❤️💛
PROMISE! 🙂
Teaser on 20th #AnteSundaraniki #AdadeSundara #AhaSundara pic.twitter.com/0A7ybAaILl— Nani (@NameisNani) April 18, 2022