Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. మొన్నీ మధ్య వచ్చిన `అఖండ` ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.
గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌ను రాబట్టి.. బాలయ్య కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. అయితే ఇప్పుడు బోయపాటితో శ్రీనుతో మరో సినిమా చేసేందుకు బాలయ్య మళ్లీ సై అంటున్నారట. కానీ, ఇక్కడో కండీషన్ పెట్టారట. అదేంటంటే.. లెజెండ్ తరహాలో మంచి పొలిటికల్ స్టోరీ అయ్యుండాలని, అప్పుడు సినిమా చేస్తానని బాలయ్య చెప్పారట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అందుకు బోయపాటి శ్రీను కూడా వెంటనే ఓకే చెప్పడంతో.. వీరి కాంబో మళ్లీ ఖరారు అయినట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో ఓ మూవీ చేస్తున్నారు. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ మూవీ అనంతరం బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై సైతం ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రెండూ పూర్తైన తర్వాత బోయపాటి, బాలయ్య సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!