NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YCP MLC Anantababu: సీఎం వైఎస్ జగన్ సీరియస్ ఆదేశాలు .. వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత బాబు అరెస్టుకు రంగం సిద్దం చేసిన పోలీసులు

YCP MLC Anantababu: సాధారణంగా అధికార పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలంటే పోలీసులకు కొంత ఇబ్బందే. ఉన్నతాధికారుల నుండి వత్తిడి ఉంటుందని కేసు విషయంలో తాత్సారం చేస్తుంటారు. అయితే కొద్ది రోజులుగా ఏపీలో అధికార పార్టీ నేతలపైనా కేసులు నమోదు అవుతున్నాయి. పలు కీలకమైన కేసుల్లో సీఎం జగన్మోహనరెడ్డి.. నిందితులు సొంత పార్టీ వారు అయినా ఉపేక్షించవద్దని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారుట. ఆ క్రమంలో సీఎం సొంత జిల్లా కడపలో ఇటీవల జగన్ సమీప బంధువుపైనా ఓ నిర్మాణ సంస్థ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తరువాత జిల్లా బహిష్కరణ వేటుకు చర్యలు చేపట్టారు.

Ap cm ys jagan serious on mlc ananta babu case
Ap cm ys jagan serious on mlc ananta babu case

YCP MLC Anantababu: ఎమ్మెల్సీ అనంతబాబు పై కేసు నమోదు

తాజాగా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ ఆనంత ఉదయ్ భాస్కర్ బాబు (అనంతబాబు) విషయంలోనూ సీఎం జగన్ సీరియస్ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయనపై హత్య నేరంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టునకు రంగం సిద్ధం చేశారు. ఆనంత బాబు అరెస్టునకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తొంది. ఎమ్మెల్సీ ఆనంత బాబు డ్రైవర్ గా పని చేసిన సుబ్రమణ్యం మృతిపై కుటుంబ సభ్యులు మొదటి నుండి అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పని ఉందని తీసుకువెళ్లి కారులో మృతదేహాన్ని కారులో తీసుకువచ్చారని, యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పారన్నారు.

Read more: Breaking: గ్యాస్ సిలెండర్ పై భారీ గా సబ్సిడీ..కేంద్రం కరుణ ఆ లబ్దిదారులకే

ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా ఇతర రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ప్రభుత్వ పెద్దల సూచనలతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. నిన్న రాత్రి కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసులో ఏ 1 గా ఎమ్మెల్సీ ఆనంత బాబును చేర్చడం జరిగిందని చెప్పారు. ఆనంత బాబు అరెస్టునకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దాన్ని హత్య కేసుగా ఆల్టర్ చేశారు.

 

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?