NewsOrbit
జాతీయం న్యూస్

President Election schedule: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం .. జూలై 18న పోలింగ్..21న ఓట్ల లెక్కింపు

President Election schedule:  భారత రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యుల్ విడుదలైంది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేశారు. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ ఈ నెల 15న జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే జోరు నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ నెల 29వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తామనీ, 30న నామినేషన్ల పరిశీలన ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు. జూలై 2వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించడం జరిగిందన్నారు.

CEC announced President Election Schedule
CEC announced President Election Schedule

President Election schedule: జూలై 18న పోలింగ్

జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ జరుగుతుందని రాజీవ్ కుమార్ చెప్పారు. ఆ తరువాత జూలై 21న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుందని, ఈ నేపథ్యంలో జూలై 25లోగా నూతన రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉందని, కావున అందుకు అనుగుణంగా షెడ్యుల్ ను ఖరారు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జరుగుతాయనీ, పోలింగ్ మాత్రం పార్లమెంట్, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఆవరణలో జరగనున్నట్లు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలియజేశారు.

పార్టీలు విప్ జారీ చేయకూడదు

ఎన్నికలకు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని రాజీవ్ కుమార్ వివరించారు. ఓటింగ్ లో పాల్గొనే ఓటర్ల మొత్తం ఓట్ల విలువ 10,86,431 అని సీఈసీ తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్ధిని కనీసం 50 మంది బలపరచాలని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఓటింగ్ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నుతో ఓటు వేస్తే అది చెల్లుబాటు కాదు. అంతే కాదు రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేయకూడదు. ప్రజా ప్రతినిధులకు స్వేచ్చగా ఓటు వేసే అవకాశం ఉంటుంది.

 

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju