Pawan Salman: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇద్దరికీ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లో.. ఇద్దరికిద్దరూ సినిమాలు రిలీజ్ అయితే ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు. ఎంతో స్టార్ డాం ఉన్న ఈ ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే టయానికి కూడా మిగతా హీరోలు ఎవరు కూడా తమ సినిమాలను రిలీజ్ చేసే సాహసం చేయరు. అటువంటిది ఈ ఇద్దరూ ఇప్పుడు కలిసి నటించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మేటర్ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి “గబ్బర్ సింగ్”. హిందీలో సల్మాన్ ఖాన్.. నటించిన “దబాంగ్” సినిమాకి రీమేక్ గా వచ్చిన.. గబ్బర్ సింగ్.. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “భగత్ సింగ్ భవదీయుడు” అనే సినిమా టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక చిన్న పాటి క్యారెక్టర్ చేయనున్నట్లు వార్త ఇటీవల వైరల్ అవుతుంది.
హరీష్ శంకర్ మొన్నామధ్య ముంబై లో సల్మాన్ ఖాన్ తో భేటీ కావడం తెలిసిందే. ఈ క్రమంలో సపరేటు గా సల్మాన్ ఖాన్ కి స్టోరీ చెప్పిన హరీష్.. పవన్ సినిమాలో చేయబోయే క్యారెక్టర్ కూడా చెప్పినట్లు.. దానికి సల్మాన్ ఓకే చెప్పినట్లు లేటెస్ట్ టాక్. ఈ విధంగా ముందుగా సల్మాన్.. పవన్ సినిమా లో కనబడి ఆ తర్వాత హరీష్ సినిమా ప్రాజెక్టు ఓకే అయితే.. అందులో నటిస్తే తెలుగు వారికి మరింత దగ్గరవుతారు అనే ప్లానింగ్ తో సల్లూభాయ్.. “భగత్ సింగ్ భవదీయుడు” లో చిన్నపాటి పాత్ర చేయడానికి రెడీ అయినట్లు వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆగస్టు నెల నుండి ప్రారంభం కానున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!