Egg Chapathi: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో చపాతి కూడా ఒకటి.. ఇక గుడ్డు ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిందే.. ప్రతి రోజు గుడ్డు తినమని చెబుతుంటారు డాక్టర్స్.. మరి ఈ రెండింటి తో కలిపి కాస్త వెరైటీగా ఎగ్ చపాతిని తయారు చేసుకోవచ్చు.. మంచి టేస్ట్ తోపాటు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కూడా అవుతుంది.. ఎగ్ చపాతి తయారీ విధానం, అందుకు కావలసిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
ఎగ్ చపాతికి కావలసిన పదార్థాలు..
గోధుమపిండి రెండు కప్పులు, కోడిగుడ్లు మూడు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు, సన్నగా తరిగిన క్యాప్సికం ఒకటి, ఉప్పు రుచికి తగినంత, కారం పావు చెంచా, మిరియాల పొడి పావు చెంచా, ధనియాల పౌడర్ కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 చెంచాలు.
ముందుగా ఒక పాత్రలో గోధుమపిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇందులో గోరువెచ్చగా ఉన్న నీటిని పోసి చపాతి పిండిని కలుపుకోవాలి. అరగంట తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, ఉప్పు, పసుపు, కారం ,మిరియాల పొడి , ధనియాల పొడి అన్నింటినీ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు పొయ్యి వెలిగించి దానిపైన పాన్ పెట్టి చపాతీని ఒక వైపు కాల్చుకోవాలి. రెండో వైపు తిప్పి దానిపై ముందుగా సిద్ధం చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమం వేసి నూనె వేసి రోస్ట్ గా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవాలి.. అంతే టేస్టీ టేస్టీ ఎగ్ చపాతీ తినడానికి రెడీ..