NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష .. కీలక ఆదేశాలు జారీ

jyothi paper targeted ys jagan

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఏలూరు జిల్లా వరకూ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు సీఎం జగన్. గోదావరి వరద ఉదృతిపై వివరాలు అడిగి తెలుసుకుని సహాయక చర్యలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. దవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద 10లక్షల క్యూసెక్కులపైగా వరద వచ్చిందనీ, ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తొందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే అవకాశం ఉందన్నారు. 16 లక్షల క్యూసెక్కుల వరకూ చేరుకునే అవకాశం ఉన్నందున దీని వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్. వరద పరిస్థితి పై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.

 

కూనవరం, చింతూరులో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయనీ, విఆర్ పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయని, కంట్రోల్ రూమ్ లు సమర్ధవంతంగా పని చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రదేశాల్లో వరద సహాయక శిబిరాలను తెరవాలని ఆదేశించారు. వరద సహాయక శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలన్నారు. సహాయక శిబిరాల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో వారికి రూ.2వేల వంతున తక్షణ సాయం అందించాలని చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలనీ, విద్యుత్, త్రాగునీరు. పారిశుద్ధ్యం తదితర ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలనీ తెలిపారు. శిధిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, ఇరిగేషన్ కాలువలు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణ సహాయక చర్యల కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాలకు రెండు కోట్లు చొప్పున నాలుగు జిల్లాలకు రూ.8 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అగ్రవర్ణాలకు కూడా..అర్హతలు ఇవీ

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri