NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో షాక్

ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ పై ఏపి సీఐడీ గతంలో నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి తాజాగా లిఖిత పూర్వక ఉత్తర్వులు బయటపడ్డాయి. ఈడీబీ సీఈఓగా పని చేసిన కాలంలో కృష్ణకిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని పేర్కొంది.   కృష్ణకిషోర్ ఈడీబీ సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద మంగళగిరి సీఐడీ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.

ఏపిలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణ కిషోర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. పరిశ్రమలు, మౌలిక వనసుతల శాఖ నుండి నివేదిక తెప్పించుకుని కేసు నమోదు చేసినట్లు అప్పుడు వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సీఐడీకి సూచించిన ప్రభుత్వం.. విచారణ పూర్తి అయ్యే వరకూ అమరావతి విడిచి వెల్లకూడదని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయన పై సెక్షన్ 188, 403, 409, 120 బీ కింద సీఐడీ కేసు నమోదు చేసింది.

ఆ నేపథ్యంలో కృష్ణకిషోర్ తన సస్పెన్షన్ పై క్వాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్వాట్) స్టే ఇచ్చింది. ఆ తరువాత విచారణ జరిపిన క్వాట్ హైదరాబాద్ బెంచ్.. కృష్ణకిషోర్ పై సస్పెన్షన్ చెల్లదని తుది తీర్పు ఇచ్చింది. తదుపరి కృష్ణ కిషోర్ పై నమోదైన కేసులపై ఏపి హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో ఆయనపై పెట్టిన సెక్షన్లు చెల్లవని కేసును క్వాష్ చేసింది. కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగా గానీ, లాభపడినట్లుగా గానీ ఎక్కడా ఆధారాలను సీఐడీ చూపలేదని తేల్చి చెప్పింది. దురుద్దేశపూర్వకంగా కృష్ణకిషోర్ పై కేసు పెట్టినట్లుగా ధర్మాసనం నిర్ధారిస్తూ.. భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టివేయదగినదిగా పేర్కొంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?