సంయుక్త మీనన్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన `భీమ్లా నాయక్` మూవీతో గ్రాండ్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `బింబిసార`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఫాంటసీ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది.
ఇందులో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఆగస్టు 5న అట్టహసంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సంయుక్త ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
ఈ ఇంటర్వ్యూలో `బింబిసార`కు సంబంధించి ఎన్నో విషయాలను పంచుకుంది. అలాగే తన `భీమ్లా నాయక్` సినిమా మరియు పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి అని, ఆయన సినిమాలో చేయడం వల్లే ఇక్కడి ప్రేక్షకులను తనని ఓన్ చేసుకున్నారని, తనపై ఎంతో ప్రేమని చూపించారని, వారి ప్రేమ ఎంతో సహజమైనదని చెప్పుకొచ్చింది.
అలాగే భీమ్లా నాయక్ థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపింది. అంతకు ముందు తాను సినిమా చేస్తే క్రిటిక్స్ మెచ్చాలని భావించానని, కానీ `భీమ్లా నాయక్` కి థియేటర్లో రరెస్పాన్స్ చూశాక.. ఆడియెన్స్ ప్రశంసలు చాలనిపించిందంటూ పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఈమె చేతిలో మరో తెలుగు చిత్రం ఉంది. అదే `సార్(తమిళంలో వాతి)`. కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇందులో హీరో కాగా.. వెంకీ అట్లూరికి దర్శకత్వం వహిస్తున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!