NewsOrbit
Telugu TV Serials న్యూస్

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా.గత ఎపిసోడ్ లో జగతిని కాఫీ అడిగి నన్ను సార్ అని పిలవద్దు రిషి అని అనండి అనడంతో జగతి సంతోషిస్తూ సరే అని కాఫీ చేసి ఇస్తుంది.ఆ తర్వాత కాఫీ తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు రిషి . ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది. రిషి కాఫీ తీసుకోవడంతో జగతి చాలా సంతోషిస్తుంది. మహీంద్రా వచ్చి.. జగతి అంటాడు. రిషి నన్ను అంటూ ఏదో చెప్పబోతుండగా నేను అంతా విన్నాను జగతి అంటాడు మహీంద్ర

జగతి మేడం ఇచ్చిన కాఫీ తాగిన రిషి :

సీన్ కట్ చేస్తే రిషి ఇచ్చిన రింగ్ ను చూస్తూ అలాగే ఉండిపోతుంది వసుధర.ఇది నాకోసమే రిషి సార్ రింగ్ చేయించారా? అనుకోకుండా నా పేరు పెట్టారా? లేక కావాలనే పెట్టారా? ఏదేమైనా మంచికే జరిగింది అనుకోవాలి అని అనుకుంటుంది వసు.ఇది నేనెలా పెట్టుకుంటాను. రిషి సార్ పెడితే అది బంధం అవుతుంది అని అనుకుంటుంది వసుధార.వీ ఒంటరిగా ఉండకూడదు. వీ ఫర్ వసుధర. వసుధర ఒంటరిగా ఎలా ఉంటుంది. పక్కన ఆర్ చేరితేనే బాగుంటుంది. వీ ఫర్ వసుధర. ఆర్ ఫర్ రిషి సర్ అని అనుకొని నోట్ బుక్ తీసి బుక్ లో వీ ఫర్ వసుధర, ఆర్ ఫర్ రిషి సర్ అంటూ రాస్తుంది.తర్వాత వీఆర్ అని రాసి లవ్ సింబల్ రాస్తుంది.

రిషి ఆలోచనల్లో జగతి :

ఇక జగతి మాత్రం నిన్ను రిషి సర్ అని పిలువొద్దు అన్నాడంటే దాని అర్థం ఏంటి జగతి అని మహీంద్రా అంటాడు. తనను ప్రతిసారి సార్ అని పిలుస్తుంటే తనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాడు. అంతకుమించి ఇంకేం లేదు అంటుంది జగతి.మరోవైపు కారు టైర్ పంచర్ అవుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు మహీంద్రా, జగతికి.ఇంతలో రిషీ కాలేజీకి బయలుదేరుతాడు. గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు. దీంతో మహీంద్రా వెళ్లి రిషిని కౌగిలించుకుంటాడు.మా కారు టైర్ పంచర్ అయింది మేము క్యాబ్ లో వెళ్తాం. నువ్వు వెళ్లు అంటాడు.నేను కాలేజీకే వెళ్తున్నాను కదా.రండి నేను డ్రాప్ చేస్తాను. నేను వెనక కూర్చొంటాను. మీరు డ్రైవ్ చేయండి అంటాడు రిషి. దీంతో జగతి డ్రైవ్ చేస్తుంది. ముందు సీటులో మహీంద్రా కూర్చొంటాడు. మరోవైపు కాలేజీకి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వసుధర.ఒక్క ఆటో కూడా రావడం లేదేంటి అలాగే డబ్బులు కూడా లేవు అని చెప్పి నడుచుకుంటూ కాలేజీకి వెళ్తుంటుంది వసుధర.

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం :

ఇంతలో కారును మధ్యలో ఆపుతుంది జగతి కారు ఆగడాన్ని చూసి పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వస్తుంది వసుధర.దీంతో కారు నేను నడుపుతాను అంటాడు మహీంద్రా.మేడమ్ మీరా సార్ కారు మీరు.. సార్ ఏరి అని అడుగుతుంది వసు. దీంతో వెనుక ఉన్నాడు అంటుంది. వసుధర రా కూర్చో అంటాడు మహీంద్రా. దీంతో రిషి పక్కన కూర్చొంటుంది వసుధర. ఆ తర్వాత కారును ఇష్టం ఉన్నట్టు డ్రైవ్ చేస్తాడు మహీంద్రా.మలుపుల వద్ద స్పీడ్ గా స్టీరింగ్ తిప్పుతాడు. దీంతో ఇద్దరూ ఒకరి మీద మరొకరు పడతారు. ఆ తర్వాత అందరూ కాలేజీకి వెళ్తారు.

రింగ్ గురించి ఆలోచిస్తున్న వసు :

క్లాస్ లో వసు రింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో పుష్ప వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది.ఇంతలో రిషి క్లాస్ చెప్పడానికి వస్తాడు. రిషి క్లాస్ చెబుతున్నా.. వసుధర మాత్రం బంగారం రింగ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తను ఏం చేస్తోంది అని అనుకుంటాడు రిషి.ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రిషి. ఏం లేదు సార్ అంటుంది. ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ హార్డ్ గా ఉండాలి అంటాడు.

 

 

 

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju