NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీఎం జగన్ సంకల్పాన్ని ప్రశంసించిన లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్)  విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు ప్రతి పేద వాడికి వైద్యం అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో వైద్యరంగంలో సమూల మార్పులను తీసుకువచ్చారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్పు చేశారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయలను కల్పించి కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో విద్య వైద్య రంగాల్లో ఏపి సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలను లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ ప్రశంసించారు.

Jayaprakash narayana comments on AP CM YS jagan reforms

విశాఖలో అందరికీ ఆరోగ్యం పుస్తకావిస్తరణ కార్యక్రమంలో పాల్గొన్న జేపి మాట్లాడుతూ విద్య , వైద్య రంగంలో ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను అభినందిస్తున్నానని చెప్పారు. విద్య, వైద్య రంగంలో నాడు – నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్ధుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తొందని అన్నారు. ఈ అంశాల్లో సీఎం వైఎస్ జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యరంగంలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకపోతే పట్టణాలకు వెల్లాల్సి ఉంటుందని చెప్పారు. పేద వర్గాలకు వైద్య సేవలు అందించే ఆరోగ్య శ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపియేనని పేర్కొన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి దేశానికి ఒక మార్గాన్ని చూపారని అన్నారు జేపి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్రీ డయోగ్నొస్టిక్ ను బాగా అమలు చేయడం అభినందనీయమని అన్నారు. ఓ పక్క రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలనా విధానాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో మేధావిగా గుర్తింపు పొందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ .. జగన్మోహనరెడ్డి విద్యా, వైద్య రంగంలో తీసుకువచ్చిన సంస్కరణను అభినందించడం విశేషం.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju