NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మైసూర్ లో సుత్తూర్ మఠపీఠాధిపతి శివరాత్రి దేశికేంద్ర స్వామిజీ ఆశీస్సులు తీసుకున్న రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతొన్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటక లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మైసూర్ లో పాదయాత్ర చేస్తున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ప్రఖ్యాత సుత్తూర్ మఠాన్ని సందర్శించి శ్రీ శివరాత్రి దేశికేంద్ర స్వామిజీ ఆశీస్సులు స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలిసి మఠాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ.. స్వామీజీని ఆశీస్సులు స్వీకరించారు. సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర సోమవారం 26వ రోజుకు చేరుకుంది. రాహుల్ పాదయాత్ర ఉత్సహంగా సాగుతోంది. రాహుల్ ను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు యాత్రకు తరలివస్తున్నారు. పాదయాత్రలో ప్రజలతో సాదరంగా రాహుల్ పలకరిస్తున్నారు. వారితో పోటోలు దిగుతున్నారు. కొందరు కార్యకర్తలు రాహుల్ తో సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు.

Rahul Gandhi

 

రాహుల్ యాత్ర వెంట అనేక మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. రోజుకు 25 కిలో మీటర్ల వరకూ రాహుల్ యాత్ర కొనసాగుతోంది. కర్ణాటకలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొననున్నారని సమాచారం. ఆమె గురువారం యాత్రలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత ప్రియాంక గాంధీ కూడా పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. రాహుల్ పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Rahul Gandhi

 

మైసూర్ లో నిన్న జోరు వర్షంలోనూ రాహుల్ పాదయాత్ర కొనసాగించారు. వర్షంలోనే రాహుల్ ప్రసంగించారు. ఆ ప్రసంగం వీడియోను ట్వీట్టర్ ఖాతాలో పోస్టు చేసిన రాహుల్ గాంధీ .. భారత్ ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. దేశ గొంతుకను వినిపించే విషయంలో ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు సాగే భారత్ జోడో యాత్రను ఎవరు ఆపలేరు అని పేర్కొన్నారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N