NewsOrbit
Entertainment News Telugu TV Serials

Karthika Deepam 24 October,1491 Episode: మోనిత చెంప పగలకొట్టిన కొత్త క్యారెక్టర్ ఎవరో తెలిస్తే మీరు షాక్ అవ్వడం గ్యారంటీ..!

Karthika Deepam 24 October,1491 Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1491వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు అక్టోబర్ 24 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో దీప సౌర్యను చూడడంతో కార్తీక్, దీప ఇద్దరు కలిసి సౌర్యను ఫాలో అవుతూ ఉంటారు. ఇక ఈరోజు కుడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.

ఆటోలో వెళ్తున్న సౌర్యను చూసి శౌర్య! అని అరుస్తుంది దీప..కానీ శౌర్య వినిపించుకోదు. కార్తీక్, దీప ఇద్దరు కారులో కలిసి సౌర్య ఆటో వెనుకాల వెళ్తూ ఉంటారు.దారిలో దీప, కార్తీక్ తో, ఇన్ని రోజులు తను శౌర్యా? కాదా? అనుకున్నాను ఇప్పుడు నాకు స్పష్టంగా తెలిసింది శౌర్యే. పాపమది నన్ను వెతుక్కుంటూ ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నట్టున్నది తను కలిసే అవకాశం చాలా సార్లు వచ్చిన సరే నేనే పట్టించుకోలేదు అనుకొని గతంలో జరిగిన సంఘటన గుర్తుతెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. 

సౌర్య కనిపించకపోవడంతో బాధలో కార్తీక్, దీప:

Deepa crying

అప్పుడు కార్తీక్ మనసులో,  అంతే దీప నేను కూడా నిన్ను మొదట్లో గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది అని బాధ పడతాడు. కొంతసేపటికి శౌర్య ఆటో వాళ్లకి కనబడదు.అప్పుడు కార్తీక్ కార్ ఆపేసి ఇద్దరు కారు దిగి శౌర్య దొరకలేదు అని బాధపడుతూ ఉంటారు.అప్పుడు కార్తీక్, ఈ ఊర్లోనే ఉన్నదని కచ్చితంగా తెలిసింది కదా ఇంక ఎలాగైనా వెతుకుదాంలే దీప బయపడొద్దు అని చెప్పాడు.

దీపను చంపడానికి మోనిత సరికొత్త ప్లాన్ :

Monitha new plan

తర్వాత సీన్ లో మోనిత కాఫీ షాప్ లో కూర్చుని ఉంటుంది. అప్పుడు అక్కడికి వాణి అనే ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది. మోనిత వాణిని పలకరించగా వాణి కాదు వాల్తేరు వాణి ఏ పనైనా సక్రమంగా చేస్తాను అని అంటుంది. దానికి మోనిత నేను చెప్పినట్టే చెయ్యు అని ఒక ప్లాన్ చెప్తుంది.అప్పుడు వాణి, ఇప్పుడు దీపని వేసేయాలి అంతే కదా అని అంటుంది. మోనిత మాత్రం ఏమైనా తేడా వస్తే అప్పుడు చెప్తాను నీ పని అంటుంది. ఒకవేళ తేడా వచ్చినా నీ పేరు బయటికి రాదు అని చెప్పి వాణి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

సౌర్య కోసం దీప, కార్తీక్ ఆవేదన :

Karthik, deepa

ఇక దీప,కార్తీక్ నిరాశతో తిరిగి ఇంటి వైపు వస్తూ ఉండగా కార్తీక్ దీపను ఇలా అడుగుతాడు.మీ వాళ్ళది హైదరాబాదు అన్నావు కదా మీ వాళ్ళందరూ అక్కడ ఉంటే మరి శౌర్య ఎందుకు ఇక్కడ ఉన్నది అని కార్తీక్ అడుగుతాడు. దానికి దీప, వాళ్ళు ఇక్కడ లేరు అమెరికా వెళ్ళిపోయారు ఇక్కడ శౌర్యని ఎందుకు వదిలేసారో తెలీదు అంటుంది.ఇల్లు కాళీ చేసి వెళ్లిపోయారు అనడంతో కార్తీక్ కార్ ఆపి, ఇల్లు మారిపోయారా అని అంటాడు. కార్ ఎందుకు ఆపారు డాక్టర్ బాబు అంటే ఏమీ లేదు అని కార్తీక్ తిరిగి కారు నడుపుతూ ఎప్పటికైనా శౌర్యని కనిపెడదాము బాధపడొద్దు అని చెప్తాడు.

దీపపై విరుచుకుపడ్డ మోనిత :

Karthik, deepa, monitha

కార్తీక్, దీప కార్ దిగి ఇంటికి వచ్చేసరికి మోనిత వాళ్ళని చూస్తుంది. నా కార్తిక్ ని ఎక్కడికి తీసుకెళ్లావ్ వంటలక్క అని కోపంగా అడగగా, కారు నడిపింది, తీసుకెళ్లింది ఆయన నన్నెందుకు అడుగుతున్నావు అని అంటుంది దీప.దానికి మోనిత, నిన్నే అనాలి నా భర్తని నువ్వు లాగేసుకుంటున్నావు? పూర్వకాలంలో ఒక భర్తను ఇంకొక అమ్మాయికి వదిలేస్తే పతివ్రత అంటారేమో కానీ ఇప్పుడు మాత్రం చేతకాని దాన్ని అని అంటారు. నేను చేతకానిదాన్ని కాదు చెంప పగిలించే దాన్ని అని దీప మీద ఫైర్ అవుతూ ఉండగా అదే సమయంలో వాణి వచ్చి మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది.

Karthika Deepam 24 October,1491 Episodeమోనితను కొట్టిన కొత్త క్యారెక్టర్ ఎవరు?

Karthika Deepam 24 October,1491 Episode

మోనిత మాత్రం షాక్ అయ్యి అలానే చూస్తూ ఏంటి ఇది నన్ను కొట్టింది అని మనసులో అనుకుంటుంది. నువ్వు నాకు ఎంత అన్యాయం చేశావు నా బొటిక్ ని నాశనం చేసావు నాకు ఇప్పుడు 20 లక్షలు నష్టం వచ్చింది అంటుంది. కార్తీక్ సార్ మీ భార్యని మీ ముందే కొట్టినందుకు నన్ను క్షమించండి అని అంటుంది.అయినా ఏంటే మోనిత ఊరంతా కార్తీక్ సార్,ఈవిడ భార్యాభర్తలు అంటున్నారు అని దీప వైపు చూపిస్తూ అంటుంది.నీకు,కార్తీక్ కి సంబంధం లేదట ఒకవేళ అది నిజమైతే నేనే వాళ్ళని కలుపుతాను అని అంటుంది. దానికి మోనిత,  ఇదేదో రివర్స్ దారి నుంచి వస్తున్నట్టున్నది అనుకుని ఏంటే నువ్వు నాకు చెంప చెల్లుమనిపించేది నేనే నీకు చుక్కలు చూపిస్తాను అని కార్తీక్ ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది మోనిత. ఆ తర్వాత వాణి దీపతో, నువ్వేం బాధపడొద్దు వదిన ఆ మోనిత పని నేను చూసుకుంటాను అని అంటుంది. అదే సమయంలో దుర్గ అక్కడికి వచ్చి వాణిని అభినందిస్తాడు. అప్పుడు వాణి నేను మోనిత అంతు చూడాలి అంటే చుట్టుపక్కల ఎక్కడైనా ఉండాలి నాకు ఒక మంచి ఇల్లు చూసి పెట్టండి అని అనగా దుర్గ, దీప ఇంట్లో ఉండమని చెప్తాడు.సరే అంటుంది వాణి .

అమ్మా నాన్నల గురించి బాధపడుతున్న సౌర్య:

Sourya crying about her parents

ఆ తర్వాత సీన్లో శౌర్య ఆటో ఎదురుగుండా కూర్చుంటూ అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా ఉన్న క్షణాలు అన్ని గుర్తుతెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.అమ్మానాన్నలు నాతోనే ఉన్నారని నాకు తెలుసు ఎలాగైనా వాళ్ళని పట్టుకుంటాను అని బాధపడుతుంది శౌర్య. అదే సమయంలో శౌర్య వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి అమ్మా సౌర్యా మీ పిన్ని ఫోన్ చేసి తానే డబ్బులతో ఇంటికి వస్తాదట మనం అక్కడికి వెళ్ళలిసిన పనిలేదు.డబ్బులు వచ్చాక మనం చిన్న వ్యాపారం మొదలు పెట్టొచ్చు అని అనడంతో సీరియల్ ముగుస్తుంది.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N