NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వికేంద్రీకరణ మద్దతుగా ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ర్యాలీ .. జసనంద్రమైన తిరుపతి వీధులు

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా విద్యార్ధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజా సంఘాలు పాల్గొనడంతో తిరుపతి వీధులు జనసంద్రంగా మారాయి. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీలేదన్నారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అమరావతి రాజధాని కావాలని జగన్ ఎప్పుడూ చెప్పలేదనీ, అమరావతిని సమర్ధించలేదని భూమన అన్నారు.

Huge Rally in Tirupati to support AP Three Capitals

 

అమరావతి శంకుస్థాపనకు జగన్ కు ఆహ్వానం వస్తే ఆయన వెళ్ల లేదని భూమన  గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఎన్నడూ మర్చిపోరని చెప్పారు. రాజధాని విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విషయాలకు కట్టుబడి ఉంటానని శాసనసభలో ఆనాడు జగన్ చెప్పారన్నారు. ప్రభుత్వ భూమిలో రాజధాని నిర్మాణం సరైనదని జగన్ చెప్పారని వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ల్యాండ్ పూలింగ్ కు తాము వ్యతిరేకమని జగన్ శాసనసభ సాక్షిగా చెప్పారని భూమన అన్నారు. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న తాము ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని పలు సందర్భాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. కర్నూలును న్యాయరాజధానిగా చేయడం ద్వారానే మరింత ప్రగతి సాధించవచ్చని అన్నారు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, వైసీపీ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

రాజధానిలో పేదల భూముల పంపిణీకి ఏపి సర్కార్ మరో ముందడుగు

Huge Rally in Tirupati to support AP Three Capitals

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?