NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode Bypoll: మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం

Munugode Bypoll:  హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి తన సమీప ప్రత్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (బీజేపీ) పై దాదాపు 10 వేలకుపైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి మూడవ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. మరో పక్క ఈ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు తమ మార్కు చూపించారు. ప్రధానంగా కారు గుర్తు పోలి ఉన్న రోడ్డు రోలర్, చపాతీ గుర్తులకు భారీగానే ఓట్లు పడ్డాయి.

Munugodu Bypoll TRS

 

టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డికి 97,006 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతికి కేవలం 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన సమయంలో పాల్వాయి స్రవంతికి 27వేలకు పైగా ఓట్లు రాగా, ఈ సారి నాలుగు వేల ఓట్ల వరకూ తగ్గాయి. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డిపై 37వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఈ సారి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన రాజగోపాల్ రెడ్డి ఆ ప్రత్యర్ధిపైనే 10వేలకుపైగా ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. నాడు రాజగోపాల్ రెడ్డికి 99,239 ఓట్లు రాగా, ఈ సారి 86,697 ఓట్లు వచ్చాయి. ప్రభాకరరెడ్డికి నాడు 61,687 ఓట్లు రాగా, ఈ సారి 97,006 ఓటలు వచ్చాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. మొత్తం 15 రౌండ్ లలో కేవలం 2,3,15 రౌండ్ లలో మాత్రమే బీజేపీ అధిక్యత కనబర్చింది. ఈ ఫలితంపై బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. అధికార టీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తానని పేర్కొంటూనే అధికార టీఆర్ఎస్ మద్యం, మనీ పంపిణీ చేసి అధర్మంగా గెలిచిందని విమర్శించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఆయన ఆరోపించారు.

Kusukuntla Prabhakar Reddy

 

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?