NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ షర్మిల పాదయాత్ర కు హైకోర్టు అనుమతి.. కానీ

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే గతంలో విధించిన షరతులను పాటించాలని కోర్టు సూచించింది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు ఎలా అనుమతి నిరాకరిస్తారని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసిఆర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. రాజకీయ విమర్శలే తప్ప వ్యక్తిగతంగా విమర్శించవద్దని హైకోర్టు సూచించింది. షర్మిల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వరంగల్లు సీపీకి హైకోర్టు ఆదేశించింది.

YS Sharmila

 

ఇటీవల వరంగల్లు జిల్లాలో షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశారు. ఆ సందర్భంగా జరిగిన దాడిలో షర్మిల వాహనం ధ్వంసం అయ్యింది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు షర్మిల పాదయాత్ర అనుమతులు రద్దు చేసి అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరగా మార్గమధ్యలోనే అరెస్టు చేశారు. షర్మిల కారు దిగకపోవడంతో ఆమె కారులో ఉండగానే క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. అనంతరం పలు సెక్షన్ల కింద అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చగా మెజిస్ట్రేట్ అమె రిమాండ్ రిపోర్టును తిరస్కరించి వ్యక్తిగత పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు.

కాగా తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వరంగల్లు పోలీసులు ఆమె పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంతో మూడు రోజుల క్రితం ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఆమరణ దీక్ష చేశారు.  ఆమె ఆరోగ్యం క్షిణించడంతో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం షర్మిల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఈ రోజు మరో సారి తన పాదయాత్రపై షర్మిల హైకోర్టును ఆశ్రయించిగా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju