NewsOrbit
జాతీయం న్యూస్

Covid XBB: ఒమిక్రాన్ ఎక్స్ బీబీ వేరియంట్ అంటూ వాట్సాప్ లో ప్రచారం.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన క్లారిటీ ఇదీ

Covid XBB:  కరోనా కొత్త వేరియంట్ పై అసలు నిజాలు కంటే అసత్య ప్రచారాలే ప్రజలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లుగా చైనా సహా పలు దేశాల్లో కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ హెచ్ బీ 7 వేగంగా వ్యాప్తి చెందుతూ అటు ప్రభుత్వాలను, ఇటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుండగా, సోషల్ మీడియాలో అసలు ఉనికిలో లేని వేరియంట్ పేరు చెప్పి తప్పుడు ప్రచారాలను చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రమాదకరమైన ఎక్స్ బీబీ వేరియంట్ దేశంలో తీవ్రంగా వ్యాపిస్తోందంటూ వాట్సాప్ లో వచ్చిన సమాచారం తీవ్ర కలకలాన్ని రేపింది. అయితే ప్రచారంపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించి. ఈ సమాచారం నకీలీదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.

corona

 

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్ 7పై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తే తప్పులేదు కానీ లేని వేరియంట్ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేయడం సరికాదు. పండుగల వేళ అందరూ ఆనందంగా గడుపుతున్న తరుణంలో ‘అమ్మో మళ్ళీ వైరస్’ అంటూ భయపెట్టేలా కొందరు సోషల్ మీడియాలో మెసేజెస్ లను పెడుతున్నారు. ఇది ఫేక్ అనేది తెలియక చాలా మంది ఆందోళన చెందారు. వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండడం ఎంత అవసరమో అనవసర భయాలతో బేంబేలెత్తకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎక్స్ బీ వేరియంట్ అంటూ ఇప్పటి వరకూ జరిగిన ప్రాచరం మొత్తం తప్పని తెలుస్తోంది.

ఒమిక్రాన్ కంటే ఇది ప్రమాదకరమైనదని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూ హెచ్ ఓ ) ఇది వరకే పేర్కొంది. దీని ప్రమాద స్థాయి డెల్టా వేరియంట్ కంటే కూడా తక్కువేనని తెలిపింది. ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం తక్కువేనని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో చైనా విజృంభణకు బీ ఎఫ్ 7 కారణం కాదని ఈ నివేదికలు పేర్కొంటున్నాయి. దగ్గు, జ్వరం, వంటి లక్షణాలు ఏమీ లేకుండానే వైరస్ ప్రభావం చూపుతుందని, కొత్త వేరియంట్ వల్ల కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెడ, వెన్ను నొప్పులు వస్తున్నాయి అంటూ ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది ఫేక్ అని కేంద్ర వైద్య ఆరోగ్య స్పష్టం చేసింది. అందులో ఉన్న విషయాలు అన్నీ ప్రజలను తప్పుదోవ వట్టించేలా ఉన్నాయని తెలిపింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?