NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నీచ రాజకీయాలు అంటూ చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్

టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి తారకరత్న గత 23 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని తారకరత్న నివాసానికి తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే తారకరత్న మృతి పై తెలుగు అకాడమి చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్న ను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారనీ తీవ్ర ఆరోపణలు చేశారు.

Lakshmi Parvathi Slams Chandrababu on Tarakaratna Death Issue

 

తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్న లక్ష్మీపార్వతి.. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడని విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్ కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్న ను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో రోజు పాదయాత్ర వాయిదా వేసినప్పుడే మరణ వార్త ప్రకటించి ఉండాలన్నారు.

ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారన్నారు. తండ్రీ కొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసునన్నారు. తారకరత్న భార్య, బిడ్డలను, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. నీచమైన రాజకీయాలు చేయడం మానివేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని లక్ష్మీపార్వతి కామెంట్స్ చేశారు. లక్ష్మీపార్వతి మాట్లాడిన వీడియో వైసీపీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

రాజకీయంగా వైరుద్యం ఉన్నప్పటికీ తారకరత్న సతీమణికి దగ్గరి బంధువు అయిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఘటనపై ఎటువంటి నెగటివ్ కామెంట్స్ చేయకపోయినా లక్ష్మీపార్వతి ఈ విధంగా సంచలన కామెంట్స్ చేయడంపై నందమూరి, నారా కుటుంబం మీద వ్యక్తిగతంగా ఉన్న కోపంతో చేశారని అంటున్నారు. నందమూరి తారకరత్న నారా లోకేష్  కుప్పం నుండి చేపట్టిన యువగళం ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొని గుండె పోటుతో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తొలుత ఆయనను కుప్పంలోని ఓ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

తారకరత్నకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు.. విజయసాయిరెడ్డి తో చంద్రబాబు

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella