Pushpa 2: 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన ఈ సినిమా ఊహించని విజయం సాధించింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేసి కళ్ళు చెదిరే కలెక్షన్స్ రికార్డు స్థాయి వసూల్ రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమాలో డైలాగులు మరియు పాటలు అదేవిధంగా స్టెప్పులు అన్నీ కూడా హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా తగ్గేదేలే అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఈ డైలాగు చెబుతూ బన్నీ చూపించిన మేనరిజం… ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు ఫాలో అవుతూనే ఉన్నారు. వివిధ పార్టీల నాయకులు కూడా ప్రత్యర్థులకు కౌంటర్లు ఇచ్చే సమయంలో ఈ డైలాగ్ చెప్పడం జరిగింది.
పుష్ప మొదటి భాగం డైలాగులు హోరెత్తించాయి. కాగా ప్రస్తుతం “పుష్ప 2” డైలాగులు విషయంలో సుకుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “డైలాగ్ లేదా పాటలు రాసేటప్పుడు రీల్స్ లో పాపులర్ అయ్యేవిధంగా ఉందో లేదో చూసుకుంటా. అందులో డైలాగులు క్లిక్ అయితే చాలామంది కనెక్ట్ అవుతారు. దానివల్ల పబ్లిసిటీ సులువు అవుతుంది. తెలుగులో ఇదే ప్లాన్ ఫాలో అయ్యాను. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చేయబోయే సినిమాలకు కూడా ఇదే ఫాలో అవుతున్నాను అంటూ… సుకుమార్ తెలియజేశారు. ఇదిలా ఉంటే “పుష్ప 2” షూటింగ్ మొదట వైజాగ్ తర్వాత హైదరాబాద్ లో జరుగగా… త్వరలో బ్యాంకాక్ లో దట్టమైన అడవిలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించడానికి సినిమా యూనిట్ వెళ్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కీలక నటీనటులు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ భాషలలో విడుదల చేస్తున్నారు. “పుష్ప 2” ఈ ఏడాది చివరిలో లేదా వచ్చేయాడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఏప్రిల్ 8వ తారీకు బన్నీ బర్తడే నేపథ్యంలో “పుష్ప 2” నుండి అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.