NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: కడప ఎంపి అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ .. అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్ ను తోసిపుచ్చిన హైకోర్టు

Breaking: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన మద్యంతర పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి సహకరించాల్సిందేనని తేల్చి చెప్పింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకోగా ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని సైతం అరెస్టు చేయడానికి సిద్దం అవుతోంది. ఈ తరుణంలో సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం తనపై కఠిన చర్యలు తీసుకోవద్దని, అదే విధంగా పిటిషన్ పై పూర్తి విచారణ ముగిసే వరకూ తనను సీఆర్పీసీ 160 సెక్షన కింద తదుపరి విచారణ జరగకుండా స్టే ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు.

ys Viveka Murder Case Telangana High court

 

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సిబీఐ దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదనీ, తన విచారణ సందర్భంలో న్యాయావాదిని  అనుమతించాలని, తన స్టేట్ మెంట్ ప్రతిని తనకు ఇవ్వాలని అవినాష్ రెడ్డి ఇటీవలే కోర్టును కోరారు. అంతే కాకుండా విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ ను కూడా చేయాలని ఆయన హైకోర్టును కోరారు. అయితే అవినాష్ రెడ్డి ఆరోపణలను సీబీఐ ఖండించింది. ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇటీవల తీర్పు రిజర్వు చేసింది. తీర్పు వచ్చే వరకూ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది.

కాగా అవినాష్ పిటిషన్లపై హైకోర్టు కొద్ది సేపటి క్రితం తీర్పు వెలువరించింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని, విచారణ రూమ్ లో  న్యాయవాదిని కనిపించేంత దూరంలో అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని ఏ క్షణంలో అయినా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగు పర్యాయాలు విచారించిన సంగతి తెలిసిందే.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella