NewsOrbit
జాతీయం న్యూస్

Salim Durani: ప్రముఖ క్రికెటర్ సలీం దురానీ మృతి

Salim Durani:  టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్ ఆల్ రౌండర్ సలీం దురానీ (88) కన్నుమూశారు. చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ వేళ ఉదయం గుజరాత్ లోని జామ్ నగర్ లో తుదిశ్వాస విడిచారు.  1971 లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ చారిత్రక విజయం అందుకోవడంలో దురానీ ప్రముఖ పాత్ర పోషించారు. భారత్ తరపున ఆయన మొత్తం 29 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో 1202 పరుగుల చేశారు. అదే విధంగా 75 వికెట్లు పడగొట్టారు.

legendary cricketer Salim Durani passed away

 

దురానీ 1934 డిసెంబర్ 11న అఫ్గానిస్థాన్ లోని కాబుల్ లో జన్మించారు. తన ఎనిమిదవ ఏట ఆయన కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. 1947 లో భారత్ – పాక్ విభజన అనంతరం దురానీ కుటుంబం భారత్ కు వచ్చేసింది. 1960 లో ముంబాయి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో భారత్ తరపున ఆయన అరంగేట్రం చేశారు. 1960 నుండి 70 దశకంలో భారత జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందారు.

ఆయన చివరి సారిగా 1973 ఫిబ్రవరి లో ముంబాయి వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆడారు. అనంతరం ఆయన క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.  దురానీ మృతి పట్ల మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సంతాపం ప్రకటించారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు క్రికెట్ ప్రముఖులు దురానీ మృతికి సంతాపం ప్రకటించారు.

YS Sharmila: షర్మిల దారి ఎటు – పరీక్ష పెట్టిన బండి

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?