NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తుని రైలు దగ్ధం కేసులో కీలక తీర్పు వెలువరించిన విజయవాడ కోర్టు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని లో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ దహనం కేసులో విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును కొట్టివేసింది. 24 మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. రైలు దహనం ఘటనలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, నేటి మంత్రి దాడిశెట్టి రాజా, నటుడు జీవీ సహా 41 మందిపై కేసులు నమోదు అయ్యాయి. వాదనలు పూర్తి అయిన తర్వాత న్యాయస్థానం స్పందిస్తూ .. దర్యాప్తు ప్రక్రియలో, నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేకపోయారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కోర్టు ప్రశ్నించింది. అనంతరం కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

Tuni Train burning case dismissed by Vijayawada railway court

 

కాగా, గత ప్రభుత్వ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున కాపు సామాజికవర్గం ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాపు రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న అప్పటి తూర్పు గోదావరి జిల్లా తునిలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు కొందరు దుండగులు నిప్పు పెటటారు. ఈ ఘటనలో రైలు పూర్తి దహనమైంది. దీంతో రైల్వే పోలీసులు ముద్రగడ పద్మనాభం సహా 41 మందిపై కేసులు పెట్టారు. మరో పక్క పోలీసు విభాగం, గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) నమోదు చేసిన పలు కేసులను ఇప్పటికే వైసీపీ సర్కార్ ఎత్తివేసింది. అయితే ఆర్పీఎఫ్ కేసు పెండింగ్ లో ఉంది.  రైల్వే చట్టంలోని సెక్షన్లు 146, 147, 153, 174(ఎ), (సీ) కింద అప్పట్లో కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు తాజాగా కేసు కొట్టివేసింది.

Breaking: తిరుమలలో ఉగ్రవాద సంచార కలకలం ఫేక్

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!