NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: సమస్యలను జనసేనకు చెప్పారని రైతులపై కక్షగడితే సహించేది లేదు

Pawan Kalyan:  రైతులు తనకు సమస్యలు చెప్పుకున్నారనీ వారిపై అధికారులు గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ వేధింపులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇటీవలి అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం పరిశీలించిన సంగతి తెలిసిందే. బాధిత రైతులను పరామర్శించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. గురువారం రాజమండ్రిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. రైతులు తమ సమస్యలను జనసేనకు చెప్పుకున్నారని కక్ష కట్టవద్దని పవన్ విజ్ఞప్తి చేశారు. డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన చేస్తే కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Pawan Kalyan

అన్నం పెట్టిన రైతును వేధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ..వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏపీలో ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు. వారికి సరైన పరిహారం వచ్చే దాకా జనసేన పోరాటాన్ని చేస్తుందని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో తడిసిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకపోవడం వల్లే అకాల వర్షాలకు ధాన్యం తడిసిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, అధికారులు తాత్సారం చేశారనీ, సీఎం క్షేత్రస్థాయిలో వాస్తవ నివేదికలు పరిశీలించలేదని విమర్శించారు. తాను పర్యటన చేస్తున్నానని తెలిసి అధికారులు హడావుడిగా గోనె సంచులు ఏర్పాటు చేశారన్నారు. ఒత్తిడి చేస్తే తప్ప పట్టించుకోవడం లేదన్నారు.

తమకు రుణ మాఫీ అవసరం లేదనీ, ప్రతి పంటకు పావలా వడ్డీకి పాతిక వేలు చొప్పున రుణం ఇప్పించండి చాలు, తాము ఎవ్వరి మీదా ఆధారపడమని రైతులు వివరించారన్నారు. తనకు వినతి పత్రం ఇద్దామని రైతులు వస్తే.. అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారన్నారు. రైతులకు వైసీపీ చేస్తున్న అన్యాయం అది అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలే తప్ప సమస్యలు చెప్పుకున్న వాళ్లపై కేసులు పెట్టి హింసిస్తే సహించేది లేదనీ, సమస్య మరింత తీవ్రమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

Centre vs Delhi govt case: సుప్రీం కోర్టులో కేంద్రానికి షాక్ .. ఢిల్లీలో అధికారంపై సంచలన తీర్పు

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!