NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Karnataka: సిద్దా రామయ్యకే మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్టానం..? హైకమాండ్ నిర్ణయంపై డీకే శివకుమార్ అసంతృప్తి

Karnataka:  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలవడిజ నాలుగు రోజులు గడుస్తున్నా సీఎం ఎవరు అన్నదానిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి. అధికారంలోకి రావడానికి తన కృషి ఉందని  డీకే శివకుమార్, సీనియారిటీ, మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కారణంగా తనకు అవకాశం ఇవ్వాలని సిద్ద రామయ్య ఇద్దరు ముఖ్యమంత్రి పదవికి పట్టుబట్టడంతో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడింది. ఎట్టకేలకు బుధవారం ఉత్కంఠకు తెరపడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ దాదాపు ఆరు గంటల పాటు చర్చలు జరిపారు. అనుభవానికి పెద్ద పీట వేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. కర్ణాటక సీఎంగా సిద్ద రామయ్య పేరును దాదాపు ఖరారు చేసింది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధికారికంగా సిద్ద రామయ్య పేరును ప్రకటించనున్నారు.

dk shivakumar siddaramaiah

 

రేపు సీఎం గా సిద్ద రామయ్య ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సిద్ద రామయ్య పేరును ఖరారు చేసిన నేపథ్యంలో డీకే శివకుమార్ తో పార్టీ హైకమాండ్ పెద్దలు మాట్లాడుతున్నారు. మరో పక్క బెంగళూరులోని సిద్ద రామయ్య నివాసం వద్ద భద్రత పెంచారు. ప్రమాణ స్వీకారానికి విపక్ష నేతలను ఆహ్వానించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అనుభవం, ఎమ్మెల్యేల మద్దతు సిద్ద రామయ్యకు కలసి వచ్చిన అంశంగా ఉండగా, డీకే శివకుమార్ కు ఇడీ, సీబీఐ కేసులు అడ్డంకిగా మారాయి అని అంటున్నారు. అధిష్టానం నిర్ణయంపై డీకే శివకుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఢిల్లీ నుండి బెంగళూరుకు చేరుకున్నారు.

తన ముఖ్య అనుచరులతో డీకే సమావేశం నిర్వహించనున్నారు. సిద్ద రామయ్య కేబినెట్ లో చేరాలన్న హైకమాండ్ నిర్ణయంపై డీకే శివకుమార్ అనుచరులు మండిపడుతున్నారు.  సిద్దా రామయ్యకు రాహుల్ గాంధీ ఆల్ ద బెస్ట్ చెప్పడంతో ఆయన వర్గంలో సంబరాలు మొదలయ్యాయి. సిద్ద రామయ్య నివాసం వద్ద ఆయన అనుచరుుల సంబరాలు నిర్వహిస్తున్నారు. అయితే డీకే శివకుమార్ ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠ నెలకొంది. సిద్దా రామయ్య కేబినెట్ లో చేరతారా లేదా అనేది వేచి చూడాలి.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైఎస్ అవినాష్ రెడ్డి .. సీజేఐ ధర్మాసనం ఏమన్నదంటే ..?

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?