NewsOrbit
న్యూస్

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు .. 11 మంది మృతి

Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం మారాయి. అతి వేగం, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. మరి కొందరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే ఏపిలోని తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతి – శ్రీకాళహస్తి ప్రధాన రహదారిలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో భార్యభర్తలు అశోక్ (40), వెంకటమ్మ (37) తోపాటు ఓ చిన్నారి (స్థానికాచారి) మరణించారు.

Road Accident

వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆర్ టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఏర్పాడు సీఐ శ్రీహరి సిబ్బందితో సహయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లెకు చెందిన వారిగా గుర్తించరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలలో ఘోర ప్రమాదాలు జరిగాయి. కొణిజర్ల నుండి వైరా వైపు వెళుతున్న కారును లారీ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చింతకాని మండలం ప్రొద్దుటూరు నుండి వైరా వైపు వెళుతున్న ఓ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో దీన్ని గమనించి దాని వెనుక ఉన్న కారు డ్రైవర్ అప్రమత్తమై స్లో చేశాడు, కానీ కారు వెనుక ఉన్న మరో లారీ డ్రైవర్ ఈ విషయాన్ని గమనించక లారీని వేగంగా ముందుకు నడపడంతో ఆ లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు .. ముందు ఉన్న లారీలోకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మరో ప్రమాదం పెనుబల్లి మండలం వీఎం బంజరు వద్ద జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో రెండు లారీ ల డ్రైవర్ లు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జు అయి డ్రైవర్ లు ఇద్దరు ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రైన్ సాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్లను బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు డ్రైవర్ లు మృతి చెందారు. ఒకరు బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర కుమార్ యాదవ్ (35) కాగా మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన లారీలను పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లీయర్ చేశారు.

Sattenapalli TDP: కోడెల కుటుంబానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు .. ‘కన్నా’కు సత్తెనపల్లి టీడీపీ ఇన్ చార్జి

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N