NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: అమిత్ షా, జెపి నడ్డా కామెంట్స్ పై వైసీపీ ఎంపీ విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు

Vijaya Sai Reddy: కేంద్ర బీజేపీ పెద్దలు ఇటీవల జగన్మోహనరెడ్డి సర్కార్ ను తూర్పారబడుతూ విమర్శలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జేపీ నడ్డా, అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పందించారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఎప్పూడు సహకారం ఉంటునే ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటుందనీ, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అని ఆయన పేర్కొన్నారు. వాళ్లు ఇద్దరు రాజకీయంగా చేసిన విమర్శలే కానీ రెండు ప్రభుత్వాల మధ్య ఎప్పటికీ సత్సంబంధాలు ఉంటాయి అన్నట్లుగా విజయసాయి రెడ్డి సెలవిచ్చారు.

Vijaya sai Reddy

అవినీతి ఎక్కడ జరిగిందో అమిత్ షా, జేపీ నడ్డా చెప్పలేకపోయారనీ, ఇచ్చే నిధులకు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు కదా.. వాళ్ల ఆడిటింగ్ లో ఎక్కడైనా అవినీతి గుర్తించారా అని విజయసాయి ప్రశ్నించారు. అవినీతి అంటూ సాధారణంగా ఆరోపణలు చేశారని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు పై ప్రకటన చేయలేదని, విభజన చట్టంలోని హామీలను కేంద్రం నెరవేర్చలేదని అన్నారు.

వైసీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడ్డారా.. బాబు ట్రాప్ లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటాయని అన్నారు. విశాఖకు కచ్చితంగా పరిపాలనా రాజధాని తరలిస్తామని విజయసాయి రెడ్డి పునరుద్ఘాటించారు. రెండేళ్ల క్రితమే పరిపాలనా రాజధానిగా కావాల్సిన కార్యాలయాలు గుర్తించామని చెప్పారు. బాబు ప్యాకేజీతో సంబంధం లేకుండా రూ.10,400 కోట్ల రెవెన్యూ లోటు సాధించామని చెబుతూ కేబినెట్ ఆమోదం తర్వాత పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తాయని తెలిపారు.

ఇదే సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోపైనా విమర్శలు చేశారు. చంద్రబాబు మినీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని, నవంబర్ నెలలో ఇతర రాష్ట్రాల హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్ – 2 మేనిఫెస్టో ఇస్తారేమో అని సెటైర్ వేశారు. ఇప్పటికే సీఎం జగన్మోహనరెడ్డి పక్క రాష్ట్రం కర్ణాటకలో టీడీపీ మేనిఫెస్టో తయారైందని విమర్శించారు. ఎన్నికలలోపు వైసీపీలోని ప్రతి కార్యకర్తను సంతృప్తి పరుస్తామని తెలిపారు.

సీఎం వైఎస్ జగన్ కు ఓబీసీ మహా సంఘ్ మెగా కన్వెన్షన్ ఆహ్వానం

Related posts

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N