NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్

Vijaya Sai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు వారాలుగా చంద్రబాబు కారాగార వాసం గడుపుతున్నారు. తరచు టీడీపీ, చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి .. చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, పలు కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇవేళ సంచలన ట్వీట్ చేశారు.

అధినాయకుడు కరప్షన్ కేసులో జైలుపాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోందని అన్నారు విజయసాయి రెడ్డి. త్వరలోనే టీడీపీ పార్టీ రెండు ముక్కలుగా చీలిపోవచ్చని అన్నారు. 40 ఏళ్లుగా టీడీపీకి మద్దతు ఇస్తున్న బలమైన వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైందనీ, బాబు దోపిడీలను తామెందుకు సమర్ధించాలన్న ఆలోచనలో పడ్డారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

మరో ట్వీట్ లో నారా భువనేశ్వరి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. రెండెకరాల ఆసామి ఆయన చంద్రబాబు హెరిటేజ్ ఎలా స్థాపించారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ‘మా కంపెనీలో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి. అవినీతికి పాల్పడే ఖర్మ మాకేమిటి’ అని ఇప్పుడు చెబితే నమ్మేదెవరు? అని ప్రశ్నించారు.  చంద్రబాబు గారి మ్యానిప్యులేటివ్ స్కిల్స్, తన మనుషులను వ్యవస్థల్లోకి జొరబెట్టింది ప్రజా సేవకోసమే అంటారు! అని ఎద్దేవా చేశారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు కాగా, మరి కొన్ని కేసులు ఆయనను చుట్టుముట్టాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసులోనూ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో చంద్రబాబును విచారించాలని సీఐడీ భావిస్తొంది. వీటికి సంబందించిన కేసు ఏసీబీ కోర్టులో నడుస్తుండగా, ఆ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరో పక్క స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది.

Chandrababu Arrest: బాబోరికి బ్యాడ్ టైమ్ నడుస్తుందా..?

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?