NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Margadarsi Case: రామోజీ, శైలజా కిరణ్ లపై చీటింగ్ కేసు నమోదు చేసి ఏపీ సీఐడీ ..ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్

Margadarsi Case: మార్గదర్శి వ్యవహారంలో మరో కేసు నమోదైంది. మార్గదర్శి వ్యవస్థాపకుల్లో ఒకరైన జీజీ రెడ్డి కుమారుడు గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు రామోజీరావు, శైలజాకిరణ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.  సెక్షన్ 420, 467, 120 – 8, రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. మార్గదర్శి లో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారనీ, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వాటా షేర్లు రాసివ్వడానికి నిరాకరించడంతో రామోజీరావు తుపాకీతో తనను బెదిరించి బలవంతంగా లాక్కున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు.

2016 నాటికి తన పేరు మీద ఉన్న షేర్ల విలువ రూ.1,59,69,600 కాగా రామోజీరావు కేవలం 39.74 వేల బ్యాంక్ చెక్కు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. అయితే తాను సంతకం పెట్టలేదనీ, తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరిట ఉన్న వాటాలను తమకు సంబంధించిన వారి పేరిట మార్చారని యూరిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జనార్థన రెడ్డి రూ.5వేలు పెట్టుబడి పెట్టారని అందుకు గానూ మార్గదర్శిలో తన తండ్రి జనార్థనరెడ్డి పేరిట కొన్ని షేర్లు రామోజీరావు ఇచ్చారని తెలిపారు.

తన తండ్రి మరణానంతరం మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని తెలిసి అపాయింట్మెంట్ కోరగా చాలా కాలం రామోజీరావు తమను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. 2016 సెప్టెంబర్ 29న రామోజీరావును కలిసిన సమయంలో బెదిరించి తన వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. తమ షేర్లు వేరే వాళ్లకు ఇవ్వాలనే ఆలోచన లేకపోవడంతో రామోజీరావు ఇచ్చిన చెక్కున నగదు గా మార్చలేదని, తమకు న్యాయం చేయాలని యూరిరెడ్డి ఏపీ సీఐడీని ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

అయితే సీఐడీ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ రామోజీరావు, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టును విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇరుపక్షాల వాదనలను బుధవారం వింటామని హైకోర్టు తెలిపింది. రామోజీ, శైలజా కిరణ్ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలను వినిపించనున్నారు.

T Congress: అలూలేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అంటే ఇదేనేమో.. సీఎం పదవిపై సీనియర్‌ల ఆశలు

Related posts

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N