NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Elections: కర్ణాటకలో క్యాంప్ నకు కాంగ్రెస్ సన్నాహాలు..? కప్పదాట్లకు కళ్లెం..!

Telangana Elections: తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. త్రిముఖ పోరు ఉన్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ నువ్వానేనా అన్నరీతిలో జరిగింది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తమ పార్టీ అభ్యర్ధులను ముందుగానే కర్ణాటక తరలించేందుకు సిద్దమవుతున్నట్లు గా తెలుస్తొంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపొందే పలువురు  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

Gandhi Bhavan

ఫలితాలకు ఇంకా రెండు రోజుల గడువు ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్ధులు ఎవరు ఇతర పార్టీల వైపు మళ్లకుండా, ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు సమాచారం. తెలంగాణలో దాదాపు 65 నుండి 70 స్థానాలు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడటంతో అధికార బీఆర్ఎస్ ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ అభ్యర్ధులను క్యాంపునకు తరలించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

Congress Party: APCC Chief Special Focus by PK and Priyanka
Congress Party

ఒక వేళ మ్యాజిక్ ఫిగర్ కు అటు ఇటుగా స్థానాలు వచ్చినా అభ్యర్ధులు ఎవరూ ప్రత్యర్ధి పార్టీవైపు జంప్ చేయకుండా ఉండేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వారిని క్యాంపులోనే ఉంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తొంది. ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకంతో అభ్యర్ధులను కర్ణాటక క్యాంప్ కు తరలించి ఉంచాలని పార్టీ అధిష్టానం సూచనలను డీకే శివకుమార్ అమలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరిని సీఎంగా ఎంపిక చేస్తారనే సమస్య కూడా ఉంది.

Revanth Reddy

దాదాపు అరడజను మందికిపైగా నేతలు సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గత సాంప్రదాయాలు చూసుకున్నట్లయితే పీసీసీ చీఫ్ లేదా సీఎల్పీ నేతను సీఎంగా ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 80 కిపైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నామని అన్నారు. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్ధి ఎంపిక ఓ ప్రక్రియ ప్రకారం సాగుతుందని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీలో చర్చించి సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత సీఎం అభ్యర్ధిని ఎంపిక చేస్తారని అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రేవంత్ రెడ్డి తెలిపారు.

Telangana Exit Poll Result: తెలంగాణలో గెలిచేది ఆ పార్టీయే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?