Telangana Exit Poll Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇవేళ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును వారి ఇష్టమైన పార్టీ, అభ్యర్ధికి వేశారు. అభ్యర్ధుల భవితవ్యం ఈవీఎం బాక్సుల్లో దాగి ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితం వెల్లడికానుంది. పోలింగ్ ముగిసిన వెంటనే అందరి దృష్టీ ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపాయి. అధికార బీఆర్ఎస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా, బీజేపీకి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య- 119 కాగా, సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్-56, బీఆర్ఎస్- 48, బీజేపీ- 10,ఇతరులకు అయిదు స్థానాలు వస్తాయని చెప్పింది.
*ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే…
కాంగ్రెస్- 58 నుంచి 67
బీఆర్ఎస్- 41 నుంచి 49
బీజేపీ- 5 నుంచి 7
స్థానాలు ఇతరులు- 7 నుంచి 9
*చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్…
కాంగ్రెస్- 67 నుంచి 78
బీఆర్ఎస్- 22 నుంచి 31
బీజేపీ- 6 నుంచి 9
ఎంఐఎం- 6 నుంచి 7
*సీ – ప్యాక్ ఎగ్జిట్ పోల్స్…
కాంగ్రెస్- 65
బీఆర్ఎస్- 41
బీజేపీ- 4
ఇతరులు- 9
*పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్…
కాంగ్రెస్- 65 నుంచి 68
బీఆర్ఎస్- 35 నుంచి 40
బీజేపీ- 7 నుంచి 10
ఇతరులు- 6 నుంచి 9 స్థానాలు వస్తాయని తెలిపాయి.
Telangana Elections: తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ .. జిల్లాల వారీగా ఓటింగ్ శాతం ఇలా..