NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా దారెటు..? రాబోయే ఎన్నికలకు యాక్టివ్ అవ్వనున్నారా…?

Vangaveeti Radha Krishna: దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా కృష్ణ తో వైసీపీ కీలక నేత, ఎంపీ మిథున్ రెడ్డి రీసెంట్ గా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ మిథున్ రెడ్డి రాధాతో సమావేశం కావడంతో తిరిగి వైసీపీ చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు.

Vangaveeti Radha Krishna

కొద్ది నెలల క్రితం రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ కావడంతో ఆయన జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధం అయ్యిందనీ, అందుకే నాదెండ్ల మనోహర్ ముందుగా ఆయనతో చర్చలు జరిపారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇంతకు ముందు రాధా సన్నిహిత మిత్రులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఆయనను వైసీపీలోకి అహ్వానించారని వార్తలు వచ్చాయి.

వంగవీటి రాధా కృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ పెద్ద గా యాక్టివ్ గా లేరు. దీంతో తరచు రాధా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. వాస్తవానికి దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్న రంగా అభిమానులు అహ్వానించినా కార్యక్రమాలకు రాధా హజరవుతూ వస్తున్నారు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇలా పార్టీలు మారుతూ పార్టీకి కమిటెడ్ గా లేకపోవడంతో తరచు రాధా పార్టీ మార్పుపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రంలో జనసేన – టీడీపీ పొత్తు ఖరారు అయిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ వైసీపీకి దూరం కాకుండా చూసుకునేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ను పార్టీలో చేర్చుకుని ఆయన కు కాకినాడ పార్లమెంట్ స్థానం, ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని భావిస్తొంది. అలానే వంగవీటి రాధా ను కూడా పార్టీలో చేర్చుకుని ఆయన కోరుకున్న స్థానాన్ని కేటాయించాలని చూస్తొందట.

కాగా, ఇటీవలే వంగవీటి రాధా వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హజరైయ్యారు. రాధా మామగారు జనసేన పార్టీలో ఉన్నారు. దీంతో రాబోయే ఎన్నికల నాటికి వంగవీటి రాధా వైసీపీలో చేరతారా లేక జనసేన లోకి వెళతారా.. లేక టీడీపీలో కొనసాగుతారా అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Janasena: జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే..?

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!