NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైఎస్ఆర్ సీపీలో బీసీ నేతలకు పెద్ద పీట

YS Jagan: జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత వరకూ ఆ దిశగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టికెట్ లు కేటాయించలేదు. కానీ మొదటి సారి ఏపీ రాజకీయాల్లో బీసీలకు అత్యధిక స్థానాలు దక్కుతున్నాయి. అధికార వైఎస్ఆర్ సీపీ రాబోయే ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపికలో బీసీలకు పెద్ద వేస్తుంది.

అసెంబ్లీ స్థానాల విషయంలో సుమారు 50 శాతం బీసీ నేతలకు టికెట్ లు ఇస్తుండగా, లోక్ సభ స్థానాల విషయానికి వస్తే 50 శాతం పైగానే ఇస్తున్నట్లు కనబడుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎటువంటి మొహమాటాలకు పోకుండా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సొంత సామాజికవర్గం, సొంత మనుషులు, సీనియర్ లు అనేవి ఏవీ పట్టించుకోకుండా సర్వే రిపోర్టులు ఆధారంగా గెలుపు అవకాశం లేని వారిని పక్కన పెట్టేస్తున్నారు. ysrcp political issuesin 6 constituencys

టికెట్లు దక్కని వారికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీలు ఇస్తొంది. కొందరు పార్టీ అధిష్టానం సూచనల మేరకు మెత్తబడుతున్నా కొందరు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ వీడుతున్న కొందరి విషయాన్ని లైట్ గా తీసుకుంటోంది. ఇప్పటి వరకూ 50 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ సమన్వయకర్తల (ఇన్ చార్జి)లను ప్రకటించగా, ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనార్టీలు 4, ఇతర వర్గాలు 13(రెడ్డి, కాపు, వైశ్య) మంది ఉన్నారు.

గతంలో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్ధులను పోటీ పెట్టిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు అయిదు స్థానాల్లో బీసీ, రెండు స్థానాల్లో మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఇన్ చార్జిలుగా నియమించింది వైసీపీ. ఆరు శాసనసభ స్థానాలకు మహిళలను, 18 స్థానాల్లో యువతకు ఇన్ చార్జిలుగా నియమించింది పార్టీ. ఇప్పటి వరకూ ప్రకటించిన 50 అసెంబ్లీ స్థానాల్లో రిజర్వుడ్ స్థానాలు 17 తీసివేస్తే 33 స్థానాలకు 16 స్థానాలను బీసీలకు అవకాశం కల్పించింది.

లోక్ సభ స్థానాల విషయానికి వస్తే ఇప్పటి వరకూ 9 స్థానాలకు ఇన్ చార్జిలను నియమించగా, బీసీలకు 6, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఒసీ ఉన్నారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు సీనియర్లు, రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

YSRCP: 21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!