NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Supreme Court: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడే కీలక తీర్పు ..ఎలా ఉండబోతోంది..? ఏపీ రాజకీయ వర్గాల్లో టెన్షన్

Supreme Court: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో వేసిన క్వాష్ పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు జస్టిస్ అనిరుద్ద బోస్, బేలా ఎం త్రివేది ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. తీర్పు ఏ విధంగా వస్తుంది అన్న దానిపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసులో వచ్చే తీర్పు చర్చనీయాంశంగా మారింది.

Supreme Court

చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన సమయంలో ఆయనకు అవినీతి నిరోధక చట్టం లోని 17 ఏ కింద గవర్నర్ అనుమతి తీసుకోలేదని చంద్రబాబు సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతి లేకుండానే తనపై కేసు నమోదు చేసినందున ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్ పై  సుప్రీం కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి.

ACB Court and Supreme Court hearing today on Chandrababu's petitions
 Chandrababu

చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్ధ లూథ్రా.. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. అదే సమయంలో ఆయనపై ఫైబర్ నెట్ కేసు నమోదు కాగా ఈ కేసులోనూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే .. స్కిల్ కేసులో తీర్పు వెల్లడించిన తర్వాతనే .. ఫైబర్ నెట్ కేసు పిటిషన్ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేశారు.

మరో పక్క స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన కేసు కూడా సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ రెండు కేసుల విచారణ ఈ నెల 17,19 తేదీల్లో విచారణకు రానున్న నేపథ్యంలో ఈరోజు 17 – ఏ పిటిషన్ పై తీర్పును సుప్రీం ధర్మాసనం వెలువరించనుంది. ఈ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడేంత వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని చంద్రబాబును సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు అనుకూలంగా గానీ లేక వ్యతిరేకంగా గానీ తీర్పు వస్తుందా .. లేక రాజ్యాంగ ధర్మాసనానికి ఈ పిటిషన్ ను పంపుతూ నిర్ణయం తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. ఈ కేసులో తీర్పు ఎలా ఉన్నా ఏపీలో ఎన్నికల ముందు రాజకీయ వర్గాల్లో కీలకం కానుంది.

Delhi Liquor Scam: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో సారి ఈడీ సమన్లు .. సమన్లపై కవిత రియాక్షన్ ఇదీ

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?