NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Actor Suman: వైసీపీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీనియర్ హీరో సుమన్ ..! ఏ స్థానం నుండి పోటీ చేయనున్నారంటే..?

Actor Suman: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టాయి. అభ్యర్ధుల ఎంపికలో అధికార వైసీపీ (YCP) ముందు వరుసలో ఉంది. ఇప్పటికే 50కిపైగా అసెంబ్లీ, ఆరడజను మందికిపైగా ఎంపీ (MP) స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ తరుణంలో టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Suman) కూడా రాజకీయ అరంగేట్రం చేయనున్నారని వార్తలు వినబడుతున్నాయి.

పలు సందర్భాల్లో ఏపీలో సీఎం జగన్మోహనరెడ్డి పరిపాలనా తీరును సుమన్ ప్రశంసించారు. జగన్ యే మళ్లీ మళ్లీ సీఎం కావాలని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. వైసీపీ పట్ల సానుకూల వైఖరితో ఉన్న సుమన్ త్వరలోనే ఆ పార్టీ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాజమంత్రి లోక్ సభ సభ్యుడుగా ఉన్న మార్గాని భరత్ ఈ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని బీసీలకే కేటాయించాలని పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది.

గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్ (తల్వార్ సుమన్ గౌడ్) ను రాజమండ్రితో రెండున్నర దశాబ్దాలుగా అనుబంధం ఉంది. రాజమండ్రి కేంద్రంగా తన మిత్రుడు నడిపే స్వర్ణాంధ్ర స్వచ్చంద సేవా సంస్థకు 25ఏళ్లుగా సుమన్ గౌరవ సలహాదారుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా వృద్ధాశ్రమం, బధిరుల పాఠశాల, అనాధులకు నిత్య అన్నదానం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లో కలిపి దాదాపు 700లకు పైగా సినిమాల్లో సుమన్ నటించారు.

దీంతో రాజమండ్రి లోక్ సభ స్థానం నుండి సుమన్ పోటీ చేస్తే ఆ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం ఉంటుందని వైసీపీ భావిస్తొందట. ఈ నియోజకవర్గ పరిధిలో బీసీ సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ. దీంతో సామాజిక సమీకరణతో పాటు సుమన్ వ్యక్తిగత సినీ చరిష్మా పార్టీకి అదనపు బలం అవుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు సుమన్ తో ఎన్నికలో పోటీ అంశంపై  చర్చలు జరపగా సానుకూలంగా స్పందించారని వార్తలు వినబడుతున్నాయి. అన్ని అనుకూలిస్తే రాజమండ్రి లోక్ సభ స్థానం నుండి సుమన్ వైసీపీ అభ్యర్ధి అవుతారని అంటున్నారు. చూడాలి మరి సుమన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారో లేదో..!

YS Jagan: ఈ యుద్ధంలో చంద్రబాబు సహా అందరూ ఓడాల్సిందే – వైఎస్ జగన్

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju