NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

డౌట్ లేదు: ష‌ర్మిల ఏపీలో ష‌ర్మిల సింగిల్ టార్గెట్ ఇదే…!

ఎలాంటి సందేహం లేదు.. ఎలాంటి అనుమానాలు లేవు.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సింగిల్ పా యింట్ అజెండానే ఎంచుకున్నారు. కేవ‌లం వైసీపీపైనే పోరాటం చేయాల‌ని భావిస్తున్నారు. ఇదీ రాజ‌కీ యాల్లోనే కాదు.. క్షేత్ర‌స్థాయిలోనూ జ‌రుగుతున్న చ‌ర్చ‌. వాస్త‌వానికి కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలుచేప‌ట్టిన స‌మ యంలో తాను పార్టీకి వెన్నెముక‌గా మార‌తాన‌ని.. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తాన‌ని.. ష‌ర్మిల చెప్పుకొచ్చారు. దీంతో పార్టీ శ్రేణులు సంబ‌ర ప‌డ్డాయి. ఎక్క‌డో ఉన్న నాయ‌కులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఏపీలో జీవం లేకుండా ప‌డి ఉన్న కాంగ్రెస్ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని.. ష‌ర్మిల మార్కు ప‌డుతుంద‌ని.. ఇక‌, త‌మ‌కు ప్ర‌త్యామ్నాయ పార్టీ ల‌భించిన‌ట్టేనని కొంద‌రు భావించారు. ఒక‌ప్పుడు ఇలాగే డీలా ప‌డిన కాంగ్రెస్‌ను ష‌ర్మిల తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర‌తో నిల‌బెట్టి పార్టీ అధికారంలోకి వ‌చ్చేలా చేశారు. ఇప్పుడు ష‌ర్మిల ఎంట్రీతో చాలా మంది వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు కూడా కాంగ్రెస్‌తో స‌రికొత్త రాజ‌కీయం కోసం ఆశ‌ప‌డ్డారు.

ప్ర‌స్తుతం టికెట్ ద‌క్క‌ని వారు.. లేదా ఆశావ‌హులు కాంగ్రెస్ వైపు మొగ్గుచూప‌నున్నార‌ని విశ్లేష‌కులు అంచ‌నా కూడా వేశారు. అయితే.. రోజులు గ‌డిచే కొద్దీ.. పార్టీ ప‌రంగా చూసుకుంటే బ‌లం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ష‌ర్మిల 15 రోజుల క్రింద‌ట పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన ప్పుడు ఎలాంటి ప‌రిస్థితి ఉందో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అలానే ఉంది. పోనీ చేరిక‌లు ఏమైనా ఉన్నాయా? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. మండ‌ల‌స్థాయిలో నాయ‌కులు కూడా గంప‌గుత్త‌గా వ‌చ్చి చేరినదాఖ‌లాలు లేవు.

పైగా ష‌ర్మిల పెడుతున్న స‌భ‌లు.. చేస్తున్న‌ ప‌ర్య‌ట‌నలు కూడా.. కేవలం వైసీపీని తిట్టిపోయ‌డం.. త‌న‌ను తాను ఎలివేట్ చేసుకుని, వైసీపీ ఓటు బ్యాంకును చీల్చ‌డ‌మ‌నే సింగిల్ అజెండాతోనే ముందుకు సాగుతున్నారు. ఆమె ప్ర‌సంగాల్లో జ‌గ‌న్‌ను, త‌న వ‌దిన భార‌తిని, వైసీపీని టార్గెట్ చేస్తున్నారే త‌ప్పా టీడీపీ, చంద్ర‌బాబు, జ‌న‌సేన‌, ప‌వ‌న్‌పై అంతే ఘాటుగా విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం ఇంకా చేయ‌లేదు. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి.. పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చెబుతున్నా.. దీనికి వ‌న‌రుల విష‌యంపై ఆమె స్పందించ‌డం లేదు.

నిజానికి గ‌తంలో రాహుల్ గాంధీ చెప్పిన‌ట్టు.. బ‌ల‌మైన నాయ‌కులు ఏపీలోనే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఎదిగిన వారు ఉన్నారు. వారంతా ఇప్పుడు త‌ట‌స్థంగా ఉన్నారు. మ‌రి వారిని చేరువ చేసుకునే ప్ర‌య‌త్నాలుచేయ‌డంలో ష‌ర్మిల ఇప్ప‌టి వ‌ర‌కు దృష్టి పెట్ట‌లేదు. ముందు కేడ‌ర్‌ను స‌మీక‌రించుకుని.. బ‌లం ఏర్పాటు చేసుకునే వ్యూహం కూడా లోపించింది. కేవ‌లం సీఎం జ‌గ‌న్‌ను, వైసీపీని తిట్టిపోసేందుకే.. ఆమె కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టారా? అనే చ‌ర్చ బ‌ల‌ప‌డుతోంది. ఇది ఎన్నిక‌ల‌కు ముందు.. పార్టీకి.. వ్య‌క్తిగ‌తంగా ఆమెకు కూడా మంచిది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N