NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

ఎన్టీఆర్ ఆ హీరోయిన్ కూతురును కూడా పెళ్లి చేసుకున్నారా… ఇంత టాప్ సీక్రెట్ ఉందా..!

తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని విశ్వవిఖ్యాత నట సౌర్వ‌భౌమ సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆయన సినిమా జీవితంలో తిరుగులేని హీరో. ఆయన సినిమాలలో కొనసాగినన్ని రోజులు ఆయనే నెంబర్ వన్ హీరో. సినిమాలలో ఆయనకు తిరుగులేదు. కృష్ణ – ఏఎన్ఆర్ లాంటి దిగ్గ‌జ నటులు పోటీ ఇచ్చినా అది కొంతవరకే. అయితే ఆయన పొలిటికల్ జీవితంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆయన ఎంత ఉత్తాన దశలోకి వెళ్లారు.. అలాగే పత‌న‌ దశను కూడా చూశారు. మరి ముఖ్యంగా లక్ష్మీ పార్వతి తో రెండో వివాహం ఇవన్నీ ఆయన రాజకీయ జీవితంలో పెను సంచలనాలు.

అలాగే ఎన్టీఆర్ మీద కొన్ని విచిత్రమైన గాసిప్పులు కూడా అప్పట్లో ప్రచారంలో ఉండేవి. ఆయన రాత్రుళ్ళు చీరకట్టుకుని పూజ చేసే వార‌ని.. తనతో పాటు నటించినా ఓ హీరోయిన్ కుమార్తెను వివాహం చేసుకొని పూజలు చేశారన్న ప్రచారం జరిగింది. అప్ప‌ట్లో ఇది ఓ సంచ‌ల‌నంగా మారింది. ఇది వాస్త‌వ‌మా ? లేదా ఆయ‌న‌పై యాంటీగా ప్ర‌చారం చేసేందుకు కొంద‌రు రాజ‌కీయ శ‌క్తులు ఇలాంటి వార్త‌లు పుట్టించాయా ? అన్న‌ది ఇప్ప‌ట‌కీ పెద్ద మిస్ట‌రీయే.

ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో సీనియ‌ర్ న‌టీమ‌ణి దేవిక‌ను బాగా ప్రోత్స‌హించారు. దేవిక‌ను ప్రోత్స‌హించ‌డంతో పాటు ఆమెతో ఎన్నో సినిమాల‌లో క‌లిసి న‌టించారు. ఎన్టీఆర్ – దేవిక కాంబినేష‌న్ అంటే అప్ప‌ట్లో తిరుగులేని హిట్ ఫెయిర్‌. ఇంకా చెప్పాలంటే దేవిక‌ను ఎన్టీఆర్‌కు తొలి ప్రియురాలిగా కూడా చెపుతారు. అప్ప‌ట్లో వీరిద్ద‌రి మ‌ధ్య బంధం కూడా ఉందన్న గుస‌గుస‌లు ఉన్నాయి. ఆ త‌ర్వాతే ఎన్టీఆర్ కృష్ణ‌కుమారి ప్రేమ‌లో ప‌డ్డార‌ని ప్ర‌చారం ఉంది. అయితే ఈ ప్రేమ ఎన్టీఆర్ సోద‌రుడు నంద‌మూరి త్రివిక్ర‌మ‌రావుకు ఇష్టం లేద‌ని… కృష్ణ‌కుమారికి వార్నింగ్ ఇచ్చి ఆమె చెన్నై నుంచి బెంగ‌ళూరు వెళ్లిపోయేలా చేశాడ‌ని అంటారు.

ఇక దేవిక కుమార్తె క‌న‌కను ఎన్టీఆర్ భార్య చ‌నిపోయాక పూజ‌లు చేయాల్సి ఉండ‌డం.. ఆ పూజ‌ల‌కు స‌తీస‌మేతంగా చేయాల్సి రావ‌డంతో క‌న‌క‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని ఆమెతో క‌లిసి పీట‌ల మీద కూర్చొని అర్ధ‌రాత్రి పూజ‌లు చేశాడ‌న్న గుస‌గుస‌లు గ‌ట్టిగా వినిపించాయి. ఇందులో వాస్త‌వ అవాస్త‌వాల సంగ‌తి ఎలా ఉన్నా అప్ప‌ట్లో ఈ ప్ర‌చారం గ‌ట్టిగా న‌డిచింది. ఇక దేవిక త‌ర్వాత క‌న‌క కూడా ఒక‌టి రెండు సినిమాలు చేసినా ఆ త‌ర్వాత ఆమె సినిమా రంగంలో నిల‌దొక్కుకోలేక‌పోయింది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella