NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: జగన్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది .. తిరిగి వైసీపీ గూటికి చేరిన ఆర్కే..ట్విస్ట్ ఏమిటంటే..?

YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇవేళ ఆర్కే తన అన్న, వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి వైసీపీ ఇన్ చార్జి గంజి చిరంజీవితో కలిసి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని సీఎం జగన్ తో భేటీ అయ్యారు. జగన్ సమయంలో పార్టీలో చేరినట్లు ప్రకటించారు.

గత డిసెంబర్ లో వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అయినా ఆర్కే రాజీనామాపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. మంగళగిరి పార్టీ ఇన్ చార్జిగా గంజి చిరంజీవిని నియమించడంతో ఆర్కే మనస్థాపానికి గురై రాజీనామా చేశారు. ఆర్కే కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తే ఓట్ల చీలిక ప్రభావంతో టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ కు లాభం చేకూరుతుందని భావించిన వైసీపీ అధిష్టానం .. ఆర్కేను మళ్లీ పార్టీలోకి తీసుకునేందుకు ఆయన సోదరుడు, వైసీపీ రాజ్యసభ్య సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని రంగంలోకి దింపింది.

దీంతో ఆయన సోదరుడితో మంతనాలు జరిపారు. అయోధ్య రామిరెడ్డి చర్చలతో మెత్తబడిన ఆర్కే ఇవేళ తిరిగి సొంత గూటికి చేరారు. మంగళగిరి అభ్యర్ధి గెలుపు బాధ్యతలను ఆర్కే భుజస్కందాలపై పార్టీ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నెల రోజుల వ్యవధిలోనే ఆర్కే తిరిగి వైసీపీ గూటికి చేరడం విశేషం.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. వైఎస్ జగన్ మంగళగిరి అభ్యర్ధిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎవరిని నియమించినా గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. కానీ గంజి చిరంజీవి పేరును మాత్రం ఉచ్చరించలేదు. ఆర్కే వెంట చిరంజీవి ఉన్నప్పటికీ అతనికి ఇన్ చార్జిగా అప్పగించినందున ఆయన గెలుపునకు కృషి చేస్తానని అనకపోవడంతో అభ్యర్ధి మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు బలం చేకూరుతోంది.

గంజి చిరంజీవి సామాజికవర్గానికే చెందిన మాజీ ఎమ్మెల్యే కొండ్రు కమల కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీ హనుమంతరావు కూడా ఆమెకే ఇవ్వాలని కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆర్కే తిరిగి పార్టీలోకి వచ్చారంటే పార్టీలో ఆయన మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.

Vibhore Steel Listing: అదరగొట్టిన విభోర్ స్టీల్ షేర్లు.. మదుపర్లకు ఎంత శాతం లాభం అంటే..? 

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju