NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ వైసీపీ సీటులో టీడీపీ క‌ర్చీఫ్ ఖాయ‌మేనా..!

ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న‌ కీలక నియోజకవర్గం ఎచ్చెర్ల. పరిశ్రమల ఖిల్లాగా పేరుగాంచిన ఈ నియోజకవర్గంలో గెలుపు ఎప్పుడూ ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలతో కలిపి ఇక్కడ 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, టీడీపీ మరో ఆరుసార్లు విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా వైసీపీ నేత‌ గొర్లె కిరణ్‌ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు.

1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కావ‌లి ప్రతిభా భారతి ఓడిపోయినా.. త‌ర్వాత కాలంలో పుంజుకున్నారు. ఈ క్ర‌మంలో 1985లో ప్రతిభా భారతిపై విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సి విజయలక్ష్మిపై 26,947 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1994లో కూడా ప్ర‌తిభా భార‌తి విజ‌యం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోండ్రు మురళీమోహన్‌ విజయం సాధించారు.

2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మీసాల నీలకంఠం నాయుడు విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మ‌ళ్లీ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన కళా వెంకటరావు విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి చేసిన గొర్లె కిరణ్‌ కుమార్‌ ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. మొత్తంగా ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆయా ఎన్నికల్లో ఆరుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.

సెంటిమెంటుకు పెద్ద‌పీట వేసే ఎచ్చెర్ల ఓట‌ర్లు.. గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఎవ‌రినీ వ‌రుస‌గా గెలిపించ‌లే దు. కాంగ్రెస్ 2009లో, టీడీపీ 2014లో, వైసీపీ 2019లో విజ‌యం ద‌క్కించుకున్నాయి. సో.. ఈ ఫార్ములానే కంటిన్యూ అయితే.. ఇక్క‌డ అదికార పార్టీ విజ‌యం సాధించ‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. అయితే.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై వైసీపీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు .. ఇక్క‌డ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు టీడీపీ గెలుపు ప‌క్కా అని భావిస్తోంది. ఎచ్చెర్ల‌పై పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు.. ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju