NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఈ 30 సీట్ల‌లో వైసీపీ గెలుపును ఎవ్వ‌రూ ఆప‌లేరు.. జిల్లాల వారీ లిస్ట్ ఇదే…!

టీడీపీ-జ‌న‌సేన మిత్రం ప‌క్షం అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మొత్తం 118 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉమ్మ‌డిగా క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించింది. మిగిలిన స్థానాల‌ను కూడా బీజేపీ క‌లిసి వ‌చ్చాక ప్ర‌క‌టించ‌ను న్నారు. ఇక‌, మిత్ర‌ప‌క్షంలో స‌హ‌జంగానే సెగ‌లు పొగ‌లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇవి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. గ‌త 2019లో జ‌రిగిన ఎన్నిక‌లతో పోల్చుకుంటే.. రాయ‌ల సీమ జిల్లాల్లోని మెజారిటీ నియోజ‌క‌వ‌ర్గాలు స‌హా.. మ‌రికొన్ని ఇత‌ర ప్రాంతాల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. ఈ రెండు పార్టీలు పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక పోయాయ‌నేది వాస్త‌వం.

శ్రీకాకుళం నుంచి పులివెందుల వ‌ర‌కు కూడా.. దాదాపు 82 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఒంట‌రిగానే 20 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని ద‌క్కించుకుంది. వీటిలో 40 నుంచి 70 వేల ఓట్ల మెజారిటీ ఉన్న స్థానాలు కూడా ఉన్నాయి. అప్ప‌ట్లో టీడీపీ, జ‌న‌సేన‌లు ఎవ‌రికివారుగా పోటీ చేయ‌డంతో ఇంత మెజారిటీ వ‌చ్చింద‌ని అనుకున్నా.. ఇప్పుడు క‌లివిడిగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ.. ఈ మేర‌కు ఓట్ల‌ను రాబ‌ట్టి.. వైసీపీని ఓడించ‌డం సాధ్య‌మేనా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ క్ర‌మంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు ద‌క్కించుకున్న ఓట్లు మెజారిటీ ఎలా ఉంద‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టీడీపీ దీనిపై ప్ర‌ధాన క‌స‌ర‌త్తు చేస్తోంది. ఎంతో క‌లిసి వ‌స్తే.. త‌ప్ప‌.. 82 స్థానాల్లో క‌నీసం 30 స్థానాల‌ను మిత్ర‌ప‌క్షం ఒడిసి ప‌ట్ట‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న ఉంది. దీనికి తోడు.. క‌లిసింది. ప్ర‌స్తుతం ఈ రెండు పార్టీలే. ఇంకా, రాష్ట్రంలో క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్‌, బీఎస్పీ, ఆప్‌, లోక‌ల్ పార్టీలు, స్వ‌తంత్రులు ఇలా.. లెక్క‌లు వేసుకుంటే.. 82 స్థానాల్లో మిత్ర‌ప‌క్షం సాధించేవి ఎన్న‌నేది ఆస‌క్తిగా మారింది.

వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో 20 వేల పైచిలుకు ఓట్లు ద‌క్కించుకున్న నియోజ‌క‌వ‌ర్గాల.. జాబితా ఇదీ!

విజ‌య‌న‌గ‌రం: సాలూరు – 20,029, పార్వతీపురం – 24,199, చీపురుపల్లి – 26,498, కురుపాం – 26,602, గజపతినగరం – 27,011, నెల్లిమర్ల – 28,051

ఉమ్మ‌డి కృష్ణా: అవనిగడ్డ – 20,725, గన్నవరం – 22,207, పామర్రు – 30,873,

నెల్లూరు : నెల్లూరు రూరల్ – 20,776(ఇక్క‌డ మిత్ర‌ప‌క్షం గెలుపు ఖాయమంటున్నారు),
ఆత్మకూరు – 22,276, ఉదయగిరి – 36,528, వెంకటగిరి -38,720,

గుంటూరు: సత్తెనపల్లి – 20,876, మాచెర్ల – 21,918, గుంటూరు ఈస్ట్ – 22,091, గురజాల – 28,613, వినుకొండ – 28,628, నరసరావుపేట – 32,277,

తూర్పు గోదావ‌రి: నిడదవోలు – 21,688, జగ్గంపేట – 23,365, తుని – 24,016, అమలాపురం – 25,654,
రాజానగరం – 31,772, రంపచోడవరం -39,206,

ఉమ్మ‌డి ప్ర‌కాశం: ఒంగోలు – 22,245, యర్రగొండపాలెం – 31,632, దర్శి – 39,057, కనిగిరి – 40,903,

విశాఖ ప‌ట్నం: నర్సీపట్నం – 23,366, అరకు – 25,441, చోడవరం – 27,637, పెందుర్తి – 28,860, పాయకరావుపేట – 31,189,

క‌ర్నూలు: మంత్రాలయం – 23,879, ఎమ్మిగనూరు – 25,610, నంద్యాల – 34,560, డోన్ -35,516, ఆళ్లగడ్డ – 35,613, శ్రీశైలం – 38,698, ఆలూర్ – 39,896, నందికొట్కూరు – 40,610,

ప‌శ్చిమ గోదావ‌రి: కొవ్వూరు – 25,248, ఉంగుటూరు – 33,153, చింతలపూడి – 36,175,గోపాలపురం – 37,461,

అనంత‌పురం: రాప్తాడు – 25,575, కదిరి – 27,243అనంతపూర్ అర్బన్ – 28,698, పుట్టపర్తి – 31,255,

క‌డ‌ప‌: కమలాపురం – 27,333, మైదుకూరు – 29,344, రాయచోటి – 32,862, కోడూరు – 34,879, రాజంపేట – 35,272, జమ్మలమడుగు – 51,641, పులివెందుల – 90,110, కడప – 54,794,

చిత్తూరు: పూతలపట్టు – 29,163, మదనపల్లె – 29,648, పలమనేరు – 31,616, శ్రీకాళహస్తి – 38,140, చిత్తూర్ – 39,968, చంద్రగిరి – 41,755.

ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాలు..
పత్తికొండ – 42,065, పోలవరం – 42,070, పాడేరు – 42,804, ప్రొద్దుటూరు – 43,148, పుంగనూరు – 43,555,
పాణ్యం – 43,857, బద్వేల్ – 44,734, సత్యవేడు – 44,744, గూడూరు – 45,458, గంగాధర నెల్లూరు – 45,594,
శింగనమల – 46,242, తంబళ్లపల్లె – 46,938, గుంతకల్ – 48,532, అనపర్తి – 55,207, సూళ్లూరుపేట – 61,292,
గిద్దలూరు – 81,035.

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju